స్కానింగ్‌ దందా

ABN , First Publish Date - 2022-06-28T06:19:22+05:30 IST

కాకినాడ జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఇష్టా ర్యాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాల్సిన ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు, ఆస్పత్రులు అందినంత దోచుకుంటున్నాయి.

స్కానింగ్‌ దందా

  • ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల ఇష్టారాజ్యం
  • పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వైనం 
  • నిర్దేశించిన ఫీజులకంటే అధికంగా వసూళ్లు 
  • అనుభవం లేని టెక్నీషియన్లతో నిర్వహణ
  • వైద్యుడి సిఫార్సు లేకుండానే పరీక్షలు
  • రోగులను నిలువు దోపిడీ చేస్తున్న నిర్వాహకులు

ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఆస్పత్రులు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారైంది. కొంచెం ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రులకు వెళ్తే చాలు జేబుకు చిల్లుపడుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు టెస్టింగ్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల వైద్యుల సూచనలు లేకుండానే స్కానింగ్‌లు, టెస్టులు చేసేస్తున్నారు. ఇతర పరీక్షలకు సైతం అదే పరిస్థితి ఉంటోంది. ఇంత దోపిడీ జరుగుతున్నా వైద్యఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

పెద్దాపురం, జూన్‌ 27: కాకినాడ జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఇష్టా ర్యాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు ప్రజలకు సేవలందించాల్సిన ప్రైవేటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు, ఆస్పత్రులు అందినంత దోచుకుంటున్నాయి. ప్రభు త్వం ఎన్ని నిబంధనలు విధించినా సరే వారి దోపిడీ మా త్రం ఆగడం లేదు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకు ని ఈ దోపిడీ సాగుతోంది. అవసరాన్ని బట్టి ధరలను పెం చేసి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కొన్నిచోట్ల స్కా నింగ్‌ చేశాక ఫలితాలను అన లైజ్‌ చేయాల్సిన రేడియాలజిస్ట్‌ లేకుండానే రిపోర్టులు సిద్ధం చేసి రోగులకు అందిస్తున్నారు. స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌ల్లో ధరల పట్టికలను ప్రదర్శించకుండా రిఫరల్‌ డాక్టర్లకు కమిషన్లు ఇచ్చి అందినంత దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానిక సీహెచ్‌సీలో పనిచేసే కొంతమంది ల్యాబ్‌ టెక్నీషియన్లు కాసులకు కక్కుర్తి ప డి బయట ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులతో కుమ్మక్తై ఆస్పత్రికి వచ్చేవారిని ప్రైవేటు ల్యాబ్‌లకు పంపి వారి నుంచి క మీషన్లు లాగేస్తున్నారు. పైగా మేము చెప్పి న ల్యాబ్‌లోనే మీరు వైద్యపరీక్షలు చేయించుకోవాలి లేదంటే  డాక్టర్‌ ఒ ప్పుకోరని రోగులకు చెప్పడంతో చేసేదిలేక ప్రైవేటు ల్యాబ్‌ల కు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పెద్దాపురం పట్టణంలో ఇటీవల ప్రైవేట్‌ ల్యాబ్‌ల ఆగడాలు ఎక్కువయ్యాయి.

స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌ల్లో తనిఖీలు శూన్యం

స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌ల్లో తనిఖీలు శూన్యంగా కనిపిస్తున్నాయి.. ఇటీవల కాలంలో తనిఖీలు చేసిన దాఖలాలే కనిపించడం లేదు. దీంతో నిర్వాహకులు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లు 120వరకు ఉండగా అనధికారికంగా వందల్లో నడుస్తున్నా యి. ప్రైవేటు ఆస్పత్రులు కూడా కొన్ని వందలు ఉన్నాయి. పెద్దాపురం పట్టణంలో 10 ప్రైవేటు టెస్టింగ్‌ ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్స్‌ ఉన్నాయి. 15 వరకూ ప్రైవేటు ఆ స్పత్రులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఈ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోయినా వారానికి ఒకసారి విజిటింగ్‌ పేరుతో ఇక్కడ స్థానిక ఆస్పత్రులకు వైద్యులు వచ్చి రోగులకు ఎక్కడా లేని విధంగా టెస్టులు రాసి వారిని దోచేస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చేసేది లేక వారు చెప్పినట్లే టెస్టులు చేయించుకుని వేలకువేలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

డెకాయ్‌ ఆపరేషన్లు ఏవీ?

జిల్లావ్యాప్తంగా ఉన్న స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌ల్లో చట్టవిరుద్ధంగా రహస్య లిం గ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలు ఏమీ కనిపించలేదు. ప్రతినెలా కలెక్టర్‌ అనుమతితో డెకాయ్‌ ఆప రేషన్లు నిర్వహించాలి. ఇందులో ఎన్‌జీవోలు తప్పకుండా ఉండాలి. ఒకవేళ తనిఖీలు చేసినా వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. వారికి నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక అధికసంఖ్యలో వైద్యపరీక్షలకు ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో నిర్వాహకులకు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. 

నిబంధనల ప్రకారం నిర్వహించకపోతే చర్యలు

స్కానింగ్‌ సెంటర్లు, ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే నిర్వహించాలి. చట్టవిరుద్ధంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. స్కానింగ్‌ కేంద్రాలు, ల్యాబ్‌లపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. డెకాయ్‌ ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరగుతోంది. స్కానింగ్‌ కేంద్రాల్లో అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 

-డాక్టర్‌ సరిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో, పెద్దాపురం

Updated Date - 2022-06-28T06:19:22+05:30 IST