పెళ్లి వేదికపై వధువు చేసిన పనికి వరుడు ఎంత సీరియస్ అయ్యాడంటే.. తలపాగా తీసి నేలకేసి కొట్టి..

Jul 21 2021 @ 11:09AM

ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకల్లో జరుగుతున్న సరదా సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడు ప్రవర్తించిన తీరు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియోలో.. పెళ్లి వేదిక మీద తాళి కట్టే సమయానికి ముందు సిందూర్ కార్యక్రమం జరుగుతోంది. పెళ్లి కూతురి నుదుటిన బొట్టు పెట్టడానికి వరుడు సిద్ధమయ్యాడు. 


ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో.. వధువు హఠాత్తుగా కింద పడిపోయింది. దీంతో వరుడు షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత వధువు ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆగ్రహానికి గురయ్యాడు. తన తలపాగా తీసి నేలకేసి కొట్టి, మెడలోని దండ తెంపేసి, వేదిక మీద నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. బంధువులు ఆపే ప్రయత్నం చేసినా అతను ఆగలేదు. ఈ వీడియోను నిరంజన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...