విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు

ABN , First Publish Date - 2021-11-08T06:44:43+05:30 IST

పట్టణంలో రోజురోజుకు అసాంఘిక కా ర్యకలాపాలు అధికమవుతున్నాయి. మట్కా, గుట్కా, పేకాట, నాటుసారా, మద్యం అక్రమ రవాణా ముఠా పెట్రేగిపోతోంది.

విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు

జోరుగా మట్కా, గుట్కా, పేకాట, మద్యం అక్రమ వ్యాపారం

నిద్రమత్తు వీడని పోలీసులు


తాడిపత్రి టౌన, నవంబరు 7: పట్టణంలో రోజురోజుకు అసాంఘిక కా ర్యకలాపాలు అధికమవుతున్నాయి. మట్కా, గుట్కా, పేకాట, నాటుసారా, మద్యం అక్రమ రవాణా ముఠా పెట్రేగిపోతోంది. తమకేమీ పట్టనట్లు పోలీ సు అధికారులు నిద్రమత్తు వీడడం లేదు. ఇదే అదునుగా అక్రమార్కులు తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా నిర్వహించుకుంటూ జనాన్ని దోచేస్తున్నారు. పోలీసు అధికారులు అసాంఘిక కార్యకలాపాలపై  నామమాత్రంగా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. గుట్కాను కర్ణాటక నుంచి పెద్దఎత్తున హోల్‌సేల్‌ వ్యాపారులు అక్రమంగా తాడిపత్రికి తరలించి పానసెంటర్లు, చిల్లర వ్యాపారుల దుకాణాలకు చేరవేస్తున్నారు. పోలీసులు హోల్‌సేల్‌ వ్యాపారులపై దృష్టిపెట్టి గు ట్కా రవాణాను అరికట్టలేకపోతున్నారు.

                             

మరోవైపు పట్టణంలో పేకాట కూ డా జోరందుకుంది. కొందరు ఇళ్లను ఆవాసంగా చేసుకొని పేకాటను నడుపుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీటికంటే అధికంగా కర్ణాటక, తెలంగాణా మద్యం వ్యాపారం భారీగా సాగుతోంది. కొందరు రాజకీయ నాయకు ల మద్దతుదారులు మద్యం వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారు. వీరి జోలికి వెళ్లడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు పెద్దఎత్తున దాడులు ని ర్వహించి భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆస్థాయిలో పోలీసుల చర్యలు లేవన్న చర్చ సాగుతోంది. 


వ్యసనాలకు బానిసలుగా కూలీలు

రోజంతా కాయకష్టం చేసి సాయంత్రం సమయానికి కూలీ తీసుకొని ఇం టికి వెళ్లాల్సిన కూలీలు అత్యాశతో మట్కా, పేకాట, నాటుసారా వంటివాటికి బానిసలుగా మారుతూ తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెం దడంతో అక్రమార్కులకు మార్గం సుగమమైందని పలువురు పేర్కొం టున్నారు. 


క్రికెట్‌ బెట్టింగ్‌లో మునిగితేలుతున్న యువత

టీ-20 ప్రపంచకప్‌ పుణ్యమా అని క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ యు వత పెడదారిన పడుతున్నారు. నివారించాల్సిన పోలీసు అధికారులు ఏ మాత్రం దాడులు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. గతంలో క్రికెట్‌ పోటీ లు జరుగుతున్న సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ బెట్టింగ్‌కు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనేవారు. ప్రస్తుతం పో లీసు అధికారులు పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2021-11-08T06:44:43+05:30 IST