ఎస్సీబీ బయోడేటా

Sep 26 2020 @ 03:32AM

పూర్తి పేరు: శ్రీపతి పండితారాధ్యుల  బాలసుబ్రహ్మణ్యం

పుట్టినతేది: 4-6-1946

జన్మస్థలం: కోనేటమ్మపేట (ప్రస్తుతం తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో ఉంది)

తల్లిదండ్రులు: సాంబమూర్తి, శకుంతల

విద్యాభ్యాసం: ప్రాథమిక అభ్యాసం నెల్లూరులో ఆంజనేయ విద్యాలయం, వీఆర్‌ స్కూలు, నగరి పీసీయస్‌ బోర్డు స్కూలు, ఎస్‌ఎస్‌ఎల్‌సీ - ఆర్‌.పి.బి. ఎస్‌. బోర్డు స్కూలు-శ్రీకాళహస్తి, పీయూసీ - ఎస్వీఆర్ట్స్‌ కళాశాల- తిరుపతి, బీఈ - అనంతపురం ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏఎంఈ - సీఐటీ చెన్నై,

సతీమణి పేరు: సావ్రితి

సంతానం: కుమార్తె పల్లవి,   కుమారుడు చరణ్‌

గాయకుడిగా తొలి తెలుగు చిత్రం: శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న (1967)


ప్రియమైన రాగం: యమన్‌

నచ్చిన క్రీడలు:  క్రికెట్‌, టెన్నిస్‌,

తొలిసారి నటించిన చిత్రం:  మహమ్మద్‌బీన్‌ తుగ్లక్‌


సంగీత దర్శకత్వం: దాసరి చిత్రం కన్యాకుమారి (1977)

తమిళంలో సంగీత దర్శకత్వం: శ్రీధర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, జయశంకర్‌ నటించిన ‘తుడిక్కుమ్‌ కరంగళ్‌’ (1985)

మెచ్చిన గాయకులు: జె.ఏసుదాస్‌, మహమ్మద్‌ రఫీ, ఎస్‌.జానకి


 


ప్రేమ వివాహం


బాలు ఎన్నో చిత్రాలలో లవ్‌సాంగ్స్‌ చక్కగా పాడారు. ఆయన జీవితం కూడా ఆ లవ్‌తోనే ప్రారంభమైంది. కుటుంబీకులకు తెలియకుండా తన దూరపు బంధువుల అమ్మాయి సావిత్రిని ప్రేమించి, సింహాచలంలో పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు పుట్టిన తర్వాతే ఇరువైపులా కుటుంబీకులు ఏకమయ్యారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.