ఎడతెరిపిలేని ముసురు

Jul 23 2021 @ 01:03AM
ముషీరాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెచ్చులూడి పడ్డ తరగతి గది

ముషీరాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుకు ముషీరాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్లాబ్‌ పెచ్చులూడి కిందపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాఠశాలలోనే కరోనా టీకాలు వేస్తుండడంతో వందలాది మంది పాఠశాలకు వస్తుంటారు. కానీ వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందే పాఠశాల భవనం స్లాబ్‌ పెచ్చులూడి కిందపడ్డాయి. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌యాదవ్‌ ముషీరాబాద్‌ విద్యామండలి డిప్యూటీ ఈవో సామ్యూల్‌రాజ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని స్లాబ్‌ పెచ్చులూడిన తరగతి గదిని పరిశీలించారు. ఎడతెరపి లేకుండా వస్తున్న వర్షాల వల్ల ఆదర్శకాలనీ, బాపూజీనగర్‌, ప్రేయర్‌ పవర్‌ చర్చి వీధి, పార్శిగుట్ట, వినోభానగర్‌ ప్రాంతాల్లో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.  

Follow Us on: