స్కూల్ బ్యాండ్ విద్యార్థుల వినూత్న ప్రాక్టీస్.. వైరలవుతున్న ఫొటోలు..

ABN , First Publish Date - 2021-02-26T17:07:42+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో ఇప్పటికే 5 లక్షల మందిని ఈ వైరస్‌ పొట్టనబెట్టుకుంది.

స్కూల్ బ్యాండ్ విద్యార్థుల వినూత్న ప్రాక్టీస్.. వైరలవుతున్న ఫొటోలు..

వెనాట్చీ, వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో ఇప్పటికే 5 లక్షల మందిని ఈ వైరస్‌ పొట్టనబెట్టుకుంది. ఇప్పటికీ అగ్రరాజ్యంలో ఇంకా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో  ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే కోవలో వాషింగ్టన్ రాష్ట్రంలోని వెనాట్చీ నగరంలో ఓ స్కూల్ బ్యాండ్‌ వినూత్నంగా ప్రాక్టీస్ చేసిన తీరు.. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


వైరస్ సోకకుండా ఉండేందుకు స్కూల్ బ్యాండ్ సభ్యులు యాంటీ కోవిడ్-19 గుడారాలు ఏర్పాటు చేసుకుని మరీ సాధన చేయడం ఈ ఫొటోలలో మనం చూడొచ్చు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. విద్యార్థులు కరోనా బారినపడకుండా తమ స్కూల్ మ్యూజిక్ అండ్ థియేటర్ ఉపాధ్యయులు ఇలా వినూత్న ఆలోచన చేశారని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇది విద్యార్థులకు కూడా బాగా నచ్చిందని, ఈ గుడారాల ద్వారా వారు ఇంతకుముందులానే అందరూ కలిసి ప్రదర్శన చేసే వీలు కలిగిందన్నారు.      



Updated Date - 2021-02-26T17:07:42+05:30 IST