రోడ్డుపై దీనంగా వృద్ధ దంపతులు.. వారిని చూసిన ఆ చిన్నారి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-16T14:18:58+05:30 IST

దయ కలిగిన హృదయంతో చేసే సేవా కార్యక్రమాలు...

రోడ్డుపై దీనంగా వృద్ధ దంపతులు.. వారిని చూసిన ఆ చిన్నారి ఏం చేశాడంటే..

దయ కలిగిన హృదయంతో చేసే సేవా కార్యక్రమాలు అందరి హృదయాలను గెలుచుకుంటాయి. అయితే ఇటువంటి పనులను చేసే పిల్లలను చూస్తే ఎంతో ముచ్చటవేస్తుంది. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఒక పాఠశాల విద్యార్థి.. ఎండలో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతులకు నీరు అందిస్తున్నాడు. హృదయానికి హత్తుకునే ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 


ఈ ఫోటోలో రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లిన ఒక పిల్లవాడు తన బాటిల్‌లో నీటిని వారి బాటిల్‌లో నింపుతుండటం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి పనులు చేయాలనే ఆలోచన కల్పిస్తే ప్రపంచమే మారిపోతుందనే సందేశాన్ని ఈ ఫొటో అందిస్తోంది. ఈ ఫోటోను షేర్ చేసిన ఐఏఎస్ అధికారి "ద్వేషం నేర్చుకుంటే వస్తుంది. దయ సహజంగా వస్తుంది" అని క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫోటోను ఇప్పటి వరకు 23 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో ట్విట్టర్ యూజర్స్ ఈ చిన్నారి ప్రవర్తన చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక యూజర్.."దయ అనేది ఒక సార్వత్రిక భాష, ఇది చాలా చిన్న వయస్సు నుండి పిల్లలకు నేర్పించాలని రాశాడు. మరొక యూజర్ ఇది"మానవత్వానికి సరైన ఉదాహరణ" అని పేర్కొన్నాడు.

Updated Date - 2022-04-16T14:18:58+05:30 IST