
- స్కూల్ వ్యాన్ కింద పడి విద్యార్థి దుర్మరణం
- వలసరవాక్కంలో విషాదం
పెరంబూర్(చెన్నై): స్థానిక వలసరవాక్కంలో స్కూల్ వ్యాన్ కింద పడి రెండో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. ఆళ్వార్‌తిరునగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దీక్షిత్ రెండవ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం యధావిధిగా స్యూల్ వ్యాన్‌లో పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థులతో కలసివ్యాన్ నుంచి దిగి కొంతదూరం వెళ్లిన దీక్షిత్, వ్యాన్‌లో కొన్ని వస్తువులు మరచిపోయినట్లు గుర్తించి మళ్లీ వ్యాన్ దగ్గరకు వచ్చాడు. పిల్లలందరూ దిగారని నిర్ధారించుకున్న డ్రైవర్ వ్యాన్‌ను పార్కింగ్ చేసేందుకు వెనక్కి నడిపాడు. ఆ సమయంలో ఊహించని విధంగా వ్యాన్ దీక్షిత్‌ను ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పాఠశాలను జిల్లా విద్యాధికారి మార్క్స్, అంబతూతర్ రెవెన్యూ అధికారి ఇళంగో, పోలీసు సహాయ కమిషనర్ మీనా తదితరులు పరిశీలించారు. ఈ ఘటనలో దీక్షిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు, డ్రైవర్ పూంగావనం, వ్యాన్‌లో విద్యార్థుల బాధ్యత చూసే ఉద్యోగిని జ్ఞానశక్తిలను అదుపులోకి తీసుకున్నారు.. కాగా, విద్యార్థి మృతితో సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థి మృతిచెందిన కేసులో పాఠశాల కరస్పాండెంట్ జయసుభాష్, ప్రిన్సిపాల్ ధనలక్ష్మిలపై పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇవి కూడా చదవండి