స్కూల్‌ బస్సును ఢీకొన్న టిప్పర్‌

Sep 28 2021 @ 11:34AM


హోసూరు(కర్ణాటక): నగరంలోని జూజువాడి ప్రాంతంలో స్కూల్‌ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా వున్నాయి. స్కూల్‌ నుంచి వెనుతిరిగి విద్యార్థులతో వెళుతున్న స్కూల్‌ బస్సు సోమవారం సాయంత్రం జూజువాడి ప్రాంతంలో మలుపు తిరిగేవేళ హోసూరు నుంచి బెంగళూరుకు వెళుతున్న టిప్పర్‌ లారీ ఒక్కసారిగా ఢీకొంది. బస్సులో ఇద్దరు విద్యార్థినులు, నలుగురు విద్యార్థులు ఉండగా డ్రైవర్‌తో పాటు విద్యార్థులంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని సిప్‌కాట్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.