Breakfasta: బడిపిల్లలకు అల్పాహారం

ABN , First Publish Date - 2022-07-28T13:53:34+05:30 IST

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో(In government primary schools) 1 నుంచి 5వ తరగది వరకు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని

Breakfasta: బడిపిల్లలకు అల్పాహారం

- 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ


చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో(In government primary schools) 1 నుంచి 5వ తరగది వరకు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతగా రూ.33.56 కోట్లతో 1,545 పాఠశాలల్లో 1.14 లక్షలమంది విద్యార్థులకు ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ‘బడిపిల్లలకు సీఎం అల్పాహారం’ పేరుతో అమలయ్యే పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఏయేరకాలు విద్యార్థులకు(For students) అందించాలనే వివరాలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


 మెనూ ఇలా..

సోమవారం ఉప్మా, సేమియా, బియ్యం, గోధుమ ఉప్మాలో ఏదైనా ఒకదానిని సాంబార్‌తో ఇస్తారు. మంగళవారం రవ్వ కిచిడీ, సేమియా కిచిడీ, మొక్కజొన్న కిచిడీ, గోధుమ రవ్వ కిచిడీలలో ఏదో ఒకటి వుంటుంది. బుధవారం సాంబారు(Sambaru)తో రవ్వ పొంగల్‌, పచ్చిబియ్యంతో చేసిన పొంగల్‌ ఏదో ఒకటి ఇస్తారు. గురువారం సేమియా, బియ్యం, రవ్వ, గోధుమరవ్వ ఉప్మాలో ఒకదానిని సాంబారుతో కలిపి ఇస్తారు. మంగళవారం జాబితాలోని కిచిడీలలో ఏదో ఒకదానితో పాటు రవ్వ కేసరి లేదా సేమియా కేసరిని శుక్రవారం అందజేస్తారు. ఒక్కో విద్యార్థికి 150 నుంచి 200 గ్రాముల అల్పాహారం, 60 మి.లీ. సాంబార్‌ ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక వారంలో రెండు రోజులు ఆయా ప్రాంతాల్లో లభించే చిరుధాన్యాలతో ఉప్మా, కిచిడి, పొంగల్‌ తయారు చేసి బడిపిల్లలకు పెట్టొచ్చు. ఈ అల్పాహారం, సాంబార్‌ తయారీకి సంబంధించి నాణ్యమైన ముడిసరకులను వాడాలని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు, నగరపాలక, పురపాలక, నగరపంచాయతీ, గ్రామపంచాయతీ సంఘాల సహకారాన్ని కూడా పొందాలన్నారు.  

 

శుభ్రత అతి ముఖ్యం..

ప్రజలు ఉపయోగించే వంటనూనె మాత్రమే వాడాలని, ఒకసారి ఉపయోగించిన నూనె రెండోసారి వాడకూడదని సూచించారు. వంటాలన్నీ శుచిగా, రుచిగా ఉన్నాయో లేదో ముందుగా పాఠశాల నిర్వాహకులు రుచి చూసి నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలన్నారు. ఆహార భద్రతా విభాగం అధికారులు వంటగదులు, బడిపిల్లలకు అందించే అల్పాహారం నాణ్యత పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2022-07-28T13:53:34+05:30 IST