విలీనంతో ప్రభుత్వ పాఠశాలల మూత

ABN , First Publish Date - 2022-08-09T04:16:48+05:30 IST

రాష్ట్రంలో 3,4, 5 తరగతుల విలీనంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు చాలా చోట్ల మూతపడ్డాయని, ఇంకా పడతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు.

విలీనంతో ప్రభుత్వ పాఠశాలల మూత
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ విఠపు

ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

మనుబోలు, ఆగస్టు 8 : రాష్ట్రంలో 3,4, 5 తరగతుల విలీనంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు చాలా చోట్ల మూతపడ్డాయని, ఇంకా పడతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం   ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మనుబోలు, బద్దెవోలు ఉన్నత పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యా యులను సమావేశపరిచి విలీనంపై సమీక్షిం చారు. ఆయన మాట్లాడుతూ విలీనం ప్రక్రియ మొదలైనప్పటినుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వదిలి ప్రైవేట్‌ పాఠశాలలకు క్యూ కడుతున్నారన్నారు. చిన్న పిల్లలు ఉన్నతపాఠశాలల విద్యార్థుల నడుమ ఉండలేరన్నారు. ప్రభుత్వం 3,4,5 తరగతుల బోధనకు ఉన్నతపాఠశాలల్లో ఇప్పటికీ ఉపాధ్యాయులను నియమించలేదన్నారు. విలీనంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేసిన బస్సు యాత్రలో చాలామంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. విలీనంతో ఇటు ఉపాధ్యా యులు, అటు విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విలీన నిర్ణయం వెనక్కుతీసుకునేలా ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో  యూ టీఎఫ్‌ నాయకులు అనిల్‌కుమార్‌, మోహన్‌రావు, శ్రీకాంత్‌, శ్రీనువాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T04:16:48+05:30 IST