పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-28T06:39:25+05:30 IST

పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మౌలిక వస తుల కోసం రూ.26.27లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

 ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 27: పాఠశాలల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మౌలిక వస తుల కోసం రూ.26.27లక్షలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్మించే డైనింగ్‌ హాల్‌ కోసం ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాల అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో రూ.7500కోట్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిందన్నారు. పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.2.4కోట్లు మంజూరు కాగా ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో సమస్యలను డాక్టర్‌ ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి నిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవిరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు నిదనాపురం దేవయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ గజవెల్లి పురుషోత్తం, వైస్‌ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జిన్నా రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ సువర్ణ రామచంద్ర, ఎంఈఓ రాజయ్య, హెచ్‌ఎం రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:39:25+05:30 IST