
ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువతి పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టింది. ఆ వెబ్సైట్లో ఆమెకు ఒక వ్యక్తి తను రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ఇష్టంగా మారింది. ఆ తరువాత ఒకరోజు అతను ఆమెను కలిశాడు. ఆ రోజు రాత్రి ఆమెను ఒక మిత్రుడి ఇంటికి పార్టీ కోసం తీసుకుపోయి అత్యాచారం చేశాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని గయా నగరంలో హన్స్‌రాజ్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్న మనీష్ రుక్రియార్(45) అనే వ్యక్తి మాట్రిమోనీ వెబ్సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఆ ప్రొఫైల్‌లో తను ఒక రాజకీయ నాయకుడని పేర్కొన్నాడు. అదే సమయంలో ఢిల్లీలోని ఒక కంపెనీ ఉద్యోగం చేసే నమ్రత(26, పేరు మార్చబడినది) అనే యువతి మాట్రిమోనీ వెబ్సైట్లో తన ప్రొఫెల్ పెట్టింది. అలా నమ్రత, మనీష్ రుక్రియార్ మాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమయ్యారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.
ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. ఒకరోజు మనీష్ ఢీల్లీకి పనిమీద వస్తున్నట్లు నమ్రతతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం నమ్రతను కలిసి ఆమెను తన మిత్రుడి ఇంటికి పార్టీకోసం తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరూలేరు. దీంతో నమ్రత ఆశ్చర్యపోయింది. ఇదంతా ఆమెకోసం సర్ప్రైజ్ చేశానని మనీష్ చెప్పాడు. ఆ తరువాత ఆమెను త్వరలో వివాహం చేసుకుంటానని నమ్మించి.. ఆమెకు ఇష్టం లేకపోయినా శృంగారం చేశాడు. ఆ తరువాత నమ్రతను ఆమె ఇంటి వెద్ద వదిలేసి తిరిగి బీహార్ వెళ్లిపోయాడు.
మరుసటి రోజు నుంచి నమ్రత ఎన్నిసార్లు మనీష్ కోసం ఫోన్ చేసినా అతను కట్ చేసేవాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నమ్రత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు బీహార్ చేరుకొని మనీష్‌ను అరెస్టు చేయడానికి వెళ్లారు. కానీ మనీష్ తనుకు పెద్దమనుషులతో పరిచయం ఉందని వారిని బెదిరించాడు. అయినా పోలసులు అతడిని తమతో రావాల్సిందిగా చెప్పారు. ఈ క్రమంతో అతడిని అరెస్టు చేయాలని ప్రయత్నించగా.. అతను పోలీసులపై దాడి చేశాడు. ఈ క్రమంలో బీహార్ పోలీసుల సహాయంతో మనీష్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి