చదువుకునేందుకు చోటెక్కడ?

ABN , First Publish Date - 2022-06-24T05:35:45+05:30 IST

ప్రాథమిక విద్య పునాది బీటలు వారుతోంది. తరగతి గదులు లేక బేల చూపులు చూస్తోంది.

చదువుకునేందుకు చోటెక్కడ?
హైస్కూల్‌ భవనంలో చదువుతున్న విద్యార్థులు

బడిని ఖాళీ చేయాలని నోటీసు

దయనీయ స్థితిలో సీఎస్‌ఐ పాఠశాలలు

దుమ్ముగూడెం, జూన్‌ 23: ప్రాథమిక విద్య పునాది బీటలు వారుతోంది. తరగతి గదులు లేక బేల చూపులు చూస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దుమ్ముగూడెం సీఎస్‌ఐ పాఠశాల ఇప్పుడు దయనీయ స్థితిలో కొట్టుమి ట్టాడుతోంది. ఏళ్ల తరబడి మండల సీఎస్‌ఐ పాఠశాలల్లో చదువులు తూతూమాత్రంగా సాగుతున్నాయనే ఆరోపణ లున్నాయి. మూతేయరు. ముందుకు సాగవనే రీతిలో సీఎస్‌ఐ బోధన పూర్తిగా కుంటుపడింది. మండలంలోని పది ప్రాఽథమిక పాఠశాలలను డోర్నకల్‌ డయాసిస్‌ వేదికగా సీఎస్‌ఐ మేనేజ్‌మెంట్‌ 1953లో ప్రారంభించింది. ప్రారంభం తొలినాళ్లలో పూర్తిస్థాయి ఉపాధ్యాయుల నియామకంతో విద్యాబోధన చక్కగా జరిగేది. ఉద్యోగ విరమణ, నియా మకపు అధికారం లేకపోవడంతో ఈ పాఠశాలలన్నీ పూ ర్తిగా కళ తప్పాయి. ఇప్ప టికే ఆరు పాఠశాలలు మూతబ డగా, ప్రస్తుతం తూరుబా క, రేగుబల్లి ప్రాఽథమిక పాఠశా లల్లో ఏకోపాధ్యాయ బోధన జరుగుతోంది. ఐదు తరగతుల కు ఒక్కరు ఉపాధ్యాయుడు. అలాగే లక్ష్మీనగరం, దుమ్ము గూడెం పాఠశాలలు రెంటికీ కలిపి కేవలం ఒక్కరే ఉపాధ్యా యుడే విధులు నిర్వర్తిస్తున్నారు. 

దుమ్ముగూడెం సీఎస్‌ఐ మూతబడేనా?

దుమ్ముగూడెం సీఎస్‌ఐ పాఠశాల కూడా భవిష్యత్తులో మూతపడే పరిస్థితి కనబడుతోంది. శిఽథిలావస్థకు చేరిన దు మ్ముగూడెం సీఎస్‌ఐ పాఠశాల భవనాన్ని రెండేళ్ల క్రితం పూర్తిగా కూల్చివేశారు. 2019 సెప్టెంబరు నుంచి స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల తరగతికి చెందిన రెండు గదుల్లో సీఎస్‌ఐ ప్రాఽథమిక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది ఆంగ్లమాధ్యమం ప్రవేశపె ట్టడంతో వారికి అదనపు తరగతి గదులు అవసరమ య్యా యి. దీంతో సీఎస్‌ఐ పాఠశాలను తమ ప్రాంగణం నుంచి ఖాళీ చేయాలంటూ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల హె చ్‌ఎం శంకర్‌ ఈనెల 14న సీఎస్‌ఐ పాఠశాల హె చ్‌ఎంకు నోటీసు జారీ చేశారు. ఈనెల 30 వరకు తరగతి గదులు ఖాళీ చేసి ఇవ్వాలని కోరారు. దీంతో సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. దుమ్ముగూడెంలో మరెక్కడా ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో సీఎస్‌ఐ పాఠశాల నిర్వహణకు సమస్య త లెత్తింది. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న సీఎస్‌ఐ పాఠశాల పూర్తిగా మూతపడే పరిస్థితి కనపడుతోంది. స మస్యలతో కొట్టుమిట్టాడుతున్న సీఎస్‌ఐ పాఠశాలల స్థా నంలో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈనెల 21న ఈ విష యాన్ని యాజమాన్యం దృష్టికి సీఎస్‌ఐ హెచ్‌ఎం తీసుకెళ్ల గా అధికారులతో మాట్లాడతామని చెప్పినట్లు తెలు స్తోంది. 


Updated Date - 2022-06-24T05:35:45+05:30 IST