బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..

Published: Thu, 17 Mar 2022 16:40:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..ప్రతీకాత్మక చిత్రం

విద్యాలయాలు దేవాలయాలతో సమానం అంటారు. కానీ ప్రస్తుతం కొన్ని విద్యాలయాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. రానురాను దారి తప్పుతున్నారు. విద్యార్థినులను వక్ర దృష్టితో చూస్తూ.. తమ కామవాంఛ తీర్చుకోవడానికి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఓ స్కూల్ యజమాని.. తమ పాఠశాలకు వచ్చే విద్యార్థినులను టార్గెట్ చేశాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడు. చివరకు అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులకు పదో తరగతి చదివే కుమార్తె ఉంది. రోజూ స్థానికంగా ఉండే పాఠశాలకు వెళ్లి వస్తూ ఉంటుంది. సదరు పాఠశాల యజమాని నిత్యం బాలికలనే టార్గెట్ చేసేవాడు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా నిత్యం బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. రోజూ ఆమెతో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి దగ్గర చేసుకున్నాడు. ఓ రోజు ఎవరూ లేని సమయం చూసి బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా తరచూ బాలికపై ఘాతుకానికి పాల్పడేవాడు.

అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ డోర్ కొట్టిన కూతురు.. ఎంతకీ తీయకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లగా..

ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె రెండు నెలల గర్భంతో ఉందని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. తర్వాత బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం నిందితుడ్ని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అక్కడంతే.. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని, గాడిద మీద ఊరేగిస్తారట.. చివరగా వారు చేసే పనేంటో తెలుసా.. ఈ వీడియోల్లో ఉన్నట్లుగా మనమూ చేద్దాం.. అంటూ యువతికి అధ్యాపకుడి సందేశం.. అన్నీ చూసిన యువతి చివరికి ఓ రోజు...‘‘ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా’’... అంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లాడు.. చివరకు వైద్య పరీక్షల్లో తేలింది ఏంటంటే.. పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..నాలుగు రోజులుగా నిద్రలో ఉన్న తల్లి.. ఇబ్బంది పెట్టొద్దని లేపని కొడుకు.. చివరగా మేనమామ ఫోన్ చేయడంతో..‘‘నాకు తెలీకుండా నువ్వు ఆ పనులు చేయొద్దు’’.. వధూవరుల మధ్య ఇదీ అగ్రిమెంట్.. అసలు విషయం ఏంటంటే..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.