పాఠశాల గదిలో మహిళా టీచర్‌తో ఆ స్థితిలో ప్రిన్సిపాల్.. గ్రామస్తులు పట్టుకుని...

ABN , First Publish Date - 2022-02-27T05:52:12+05:30 IST

పాఠశాలలోనే కామ కలపాలు సాగించిన ఉపాధ్యాయులను విద్యార్థులు, గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరూ స్కూల్ వెనుక ఉన్న గదిలో శృంగారం సాగిస్తూ దొరికిపోయారు. ఆ వివాదాన్ని సద్దుమణిగించేందుకు విద్యాశాఖ అధికారులు...

పాఠశాల గదిలో మహిళా టీచర్‌తో ఆ స్థితిలో  ప్రిన్సిపాల్.. గ్రామస్తులు పట్టుకుని...

పాఠశాలలోనే కామ కలపాలు సాగించిన ఉపాధ్యాయులను విద్యార్థులు, గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరూ స్కూల్ వెనుక ఉన్న గదిలో శృంగారం సాగిస్తూ దొరికిపోయారు. ఆ వివాదాన్ని సద్దుమణిగించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు పట్టుబట్టడంతో ఆ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. 


 రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామం పాఠశాలలో ధర్మపాల్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే పాఠశాలలో మిడిల్ స్కూల్ లెవల్-2 టీచర్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి సంబంధం గురించి విద్యార్థుల ద్వారా గ్రామస్థులకు తెలిసింది. వారం రోజుల క్రితం ఇద్దరూ పాఠశాల వెనకాల ఓ గదిలో శృంగారం సాగిస్తుండగా గ్రామస్థులు, విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు తెలియకుండా ఆపేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నించారు. కానీ గ్రామస్థులు ప్రిన్సిపాల్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం మీడియా దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మహిళా టీచర్‌, ప్రిన్సిపాల్‌ ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిసింది.



Updated Date - 2022-02-27T05:52:12+05:30 IST