బడుల్లో సందడి

ABN , First Publish Date - 2021-02-25T05:20:59+05:30 IST

బడుల్లో సందడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు

బడుల్లో సందడి
ప్రతాప్‌సింగారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో మాస్కులతో విద్యార్థులు

  • 6,7,8 తరగతుల ప్రత్యక్ష విద్యాబోధన మొదలు
  • తొలిరోజు 15.85 శాతమే హాజరు 

(ఆంధ్రజ్యోతి, రంగా రెడ్డి అర్బన్‌)  : బడుల్లో సందడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధ వారం 6 నుంచి 8వ తరగతులకు విద్యాబోధన ప్రా రంభించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన ఈ తరగతుల విద్యాబోధన తిరిగి మొదలుపెట్టారు. ఇప్పటికే 9,10 తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు తెరచుకున్నాయి. తల్లిదండ్రుల అంగీకారంతో విద్యార్థులు బడిబాట పట్టారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలలకు చేరుకున్నారు. బడులకు హాజరైన విద్యార్థులను థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశారు. మాస్కులు అందించి తరగతి గదుల్లోకి పంపించారు. బెంచీకి ఒకరు, ఇద్దరు కూర్చునేలా చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్‌/లోకల్‌బాడీ, మోడల్‌ స్కూల్స్‌, కేజీబీవీ, టీఆర్‌ఈ, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కలుపుకుని 1,697 పాఠశాలలున్నాయి. 6,7,8 తరగతులకు సంబంధించి 1,61,918 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి రోజు 25,671 విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. 15.85 శాతం నమోదైంది. 


ఆరో తరగతిలో 14.05 శాతం 

ఆరో తరగతిలో 56, 700 మంది విద్యార్థులు ఉన్నారు. మొద టిరోజు 7,969 మంది విద్యార్థులు బడికి వెళ్లారు. దీంతో 14.05 హాజరు శాతం నమోదైంది. లోకల్‌బాడీ/గవర్నమెంట్‌కు సంబంధించి 18.58 శాతం, మోడల్‌ స్కూల్‌కు సంబంధించి 17.18 శాతం, కేజీబీవీ 16.12 శాతం, టీఆర్‌ఈ 15.7 శాతం, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ 12.56 శాతం మంది హాజరయ్యారు. 


7వ తరగతిలో 15.65 శాతం

7వ తరగతిలో మొత్తం 54,220 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో మొదటిరోజు 8,488 మంది విద్యార్థులు బడికి వెళ్లారు. 15.65 హాజరు శాతం నమోదైంది. ఇందులో గవర్నమెంట్‌/లోకల్‌బాడీ 19.22శాతం నమోదు కాగా, మోడల్‌ స్కూల్‌ 14.46 శాతం, కేజీబీవీ 18.28 శాతం, టీఆర్‌ఈ 23.55శాతం, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 14.30 శాతం నమోదైంది. 


8వ తరగతిలో 18.07 శాతం

8వ తరగతిలో 50,998 మంది విద్యార్థులు ఉండగా, మొదటిరోజు 9,214మంది విద్యార్థులు బడికి వెళ్లారు. 18.07 హాజరుశాతం నమోదైంది. ఇందులో గవర్నమెంట్‌/లోకల్‌బాడీ 17.91 శాతం నమోదు కాగా మోడల్‌ స్కూల్‌ 14.83 శాతం, కేజీబీవీ 13.81శాతం, టీఆర్‌ఈ 19.22 శాతం, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 18.32 శాతం నమోదైంది. 


మాస్కులు విధిగా ధరించాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ప్రతి విద్యార్థి మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని ప్రతాప్‌సింగారం సర్పంచు వంగూరి శివశంకర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప్‌సింగారం జిల్లా పరిషత్‌ పాఠ శాలలో బుధవారం గ్రాండ్‌మదర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌, గ్రాండ్‌ మదర్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కుంటోళ్ల యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


రంగారెడ్డి జిల్లాలో 6,7,8 తరగతుల విద్యార్థులు, తొలి రోజు బడికి హాజరు

మేనేజ్‌మెంట్‌             స్కూళ్ల సంఖ్య విద్యార్థులు హాజరు         శాతం

గవర్నమెంట్‌/లోకల్‌బాడీ 430         41,482 7,697 18.56

మోడల్‌ స్కూల్‌         09         2,437 376         15.43

కేజీబీవీ                 20         2,428 388         15.98

టీఆర్‌ఈ                 07         769         147         19.12

ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌         1,231 1,14,802 17,063 14.86



Updated Date - 2021-02-25T05:20:59+05:30 IST