
పెరంబూర్(చెన్నై): ద్విచక్ర వాహనాలపై వచ్చే విద్యార్థులను పాఠశాల ప్రాంగణాల్లోకి అనుమతించరాదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించడాన్ని అడ్డుకొనేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆ మేరకు పాఠశాలలకు విద్యాశాఖ పంపిన ఉత్తర్వుల్లో, పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి బస్సులు ఎక్కే సమయంలో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించాల్సి వస్తుందన్నారు. దీనిని అడ్డుకొనేలా ఒక తరగతి విద్యార్థులను వదిలిన 15 నిమిషాల తర్వాత మరో తరగతి విద్యార్థులను బయటకు పంపాలని పేర్కొంది. అలాగే, 18 ఏళ్లు నిండని విద్యార్థులు ద్విచక్రవాహనాలపై వస్తే వారిని పాఠశాల ప్రాంగణంలోకి అనుమతించరాదని, ఈ మార్గదర్శకాల పర్యవేక్షణకు ప్రత్యేక ఉపాధ్యాయుల బృందం నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి