ఉత్తషో

ABN , First Publish Date - 2021-11-23T06:40:55+05:30 IST

నూతన విద్యా విధానం పేరుతో సంస్కరణలు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన విలీనం ప్రక్రియ వికటిస్తోంది.

ఉత్తషో

3,4,5 తరగతుల విలీనం పేపర్ల మీదే !

జిల్లాలో 311 పాఠశాలలు విలీనం

కానరాని అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాలు

ముందుచూపులేకపోవటంతో వికటిస్తున్న విలీన విధానం

 



     జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ(ఎస్కేడీ) నగర పాలక ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 3,4,5 క్లాసులను తీసుకెళ్లి....50 అడుగుల దూరంలోని శ్రీకృష్ణదేవరాయ (ఎస్కేడీ) నగర పాలక ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కానీ.... ఎక్కడివారక్కడే ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలోని 135 మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలో చేరాలి. అయితే అక్కడ అదనపు తరగతి గదులు లేక పాత పాఠశాలలోనే ఉన్నారు’.

    

జిల్లా వ్యాప్తంగా 1291 అదనపు తరగతి గదులు అవసరం అవుతాయని రాష్ట్ర స్థాయి అధికారులు తాత్కాలింగా నిర్ణయించారు. ఇంకా ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ముందు చూపు లేకుండా విలీనం చేయడం వల్ల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

అనంతపురం విద్య, నవంబరు 22: నూతన విద్యా విధానం పేరుతో సంస్కరణలు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన విలీనం ప్రక్రియ వికటిస్తోంది. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 250 మీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలనే ప్రక్రియ అంతా పేపర్‌పైనే నడిచింది. క్షేత్ర స్థాయిలో అడుగు కూడా ముందుకు పడని దుస్థితి. అదనపు తరగతి గదులు లేకుండానే ప్రాథమిక పాఠశాల ల్లోని తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశామని చెబుతున్నా...90 శాతం పాఠశాలలు ఎక్కడికక్కడే ఉన్నాయి. విలీనంపై ఏపీ సర్కారు, విద్యాశాఖ చేస్తున్న షోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


అనంతపురం విద్య, నవంబరు 22: నూతన విద్యా విధానం పేరుతో సంస్కరణలు అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన విలీనం ప్రక్రియ వికటిస్తోంది. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 250 మీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలనే ప్రక్రియ అంతా పేపర్‌పైనే నడిచింది. క్షేత్ర స్థాయిలో అడుగు కూడా ముందుకు పడని దుస్థితి. అదనపు తరగతి గదులు లేకుండానే ప్రాథమిక పాఠశాల ల్లోని తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశామని చెబుతున్నా...90 శాతం పాఠశాలలు ఎక్కడికక్కడే ఉన్నాయి. విలీనంపై ఏపీ సర్కారు, విద్యాశాఖ చేస్తున్న షోపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


వసతుల్లేని విలీనం 

జిల్లా వ్యాప్తంగా 311 పాఠశాలలను విలీనం చేసినట్లు విద్యాశాఖాధికారుల లెక్కలు చెబుతున్నాయి. 250 మీటర్ల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను కలిపినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రైమరీ నుంచి హై స్కూళ్లకు సుమారు 80  నుంచి 180 మంది వరకూ విద్యార్థులు వెళ్లి చేరాల్సి ఉంది.  311 స్కూళ్లను విలీనం చేస్తే 90 శాతం స్కూళ్లలో ఎక్కడివారు అక్కడే ఉన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి  వెళ్లిన విద్యార్థులకు ఉన్నత పాఠశాలలో కూర్చోడానికి గదులు, ఉపాధ్యాయులు లేకపోవటమే కారణం.   ఎలాంటి ముందస్తు వసతులు కల్పించకుండానే విలీనం చేసేశారు. దీంతో ఈ ప్రక్రియ పెద్ద గందరగళానికి దారి దీసింది. అనంతపురంలోని ఎస్కేడీ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో మొత్తం 216 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నది ఇద్దరు టీచర్లే. ఇటీవల విలీనంలో భాగంగా అందులోని 3,4,5 తరగతులను సమీపంలోని ఎస్కేడీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఎస్కేడీ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతిలో బాలురు 22 మంది, బాలికలు 19 మంది, 4లో బాలురు 24 మంది, బాలికలు 27మంది, 5వ తరగతిలో  బాలురు 19 మంది, బాలికలు 24 మంది ఉన్నారు. విలీనం కారణంగా ఆ పాఠశాలలోని 3,4,5 తరగతుల నుంచి మొత్తం 135 మంది విద్యార్థులు ఎస్కేడీ ఉన్నత పాఠశాలలో చేరి చదువుకోవాల్సి ఉంది. అయితే అక్కడ అదనపు తరగతి గదులు లేవు. పైగా ఉపాధ్యాయుల కొరత. కొత్తగా వచ్చి చేరిన పిల్లలకు ఎండీఎం అందిం చేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇవేవీ చేయకుండా ముందుకు కదలడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. 311 స్కూళ్ల విలీనం చేస్తే...సుమారు 290 నుంచి 300 స్కూళ్లతో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. 


1291 ఏసీఆర్‌లు అవసరం 

జిల్లా వ్యాప్తంగా 1291 ఏసీఆర్‌(అడిషనల్‌ క్లాస్‌ రూమ్‌)లు అవసరమని తాత్కాలికంగా తేల్చారు. వీటి  కోసం రూ. 154.92 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీటిలో సైతం మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ముందు ఎలాంటి ప్రణాళికల లేకుండా చేయడంతో ఈ విలీన ప్రక్రియ ప్రభుత్వానికి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.



ప్రమాదంలో విద్యా ప్రమాణాలు: సాలవేముల బాబు, ఫ్యాప్టో  జిల్లా ప్రధానకార్యదర్శి

ప్రైమరీలోని 3,4,5 క్లాసులను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేశారు. అయితే హైస ్కూళ్లలో అదనపు తరగతి గదులు కొరత,  ఇతర సౌకర్యాలు ఏర్పాటు తూ తూ మంత్రంగా ఉంది. దీంతో విద్యార్థులు, టీచర్లకు  సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికే 2019లో కొవిడ్‌ వల్ల విద్యాప్రమాణాలు తగ్గాయి. ఈ విలీనం వల్ల  విద్యా ప్రమాణాలు మరింత ప్రమాదంలో పడ్డాయి. 


యథాతథంగా కొనసాగించాలి: సూర్యుడు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

స్కూళ్ల విలీనం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నా యి. 3,4,5 క్లాసుల నుంచి హైస్కూల్‌కు వందల సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నారు. ఇప్పటికే చాలా హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. దీంతో ప్రైమరీ నుంచి వెళ్లిన విద్యార్థులకు ఒక టీచర్‌ మాత్రమే హై స్కూల్‌కు వెళితే ఒక టీచర్‌ మూడు క్లాసులు బోధించే దుస్థితి నెలకొంది. అనేక అవస్థలు, ఇబ్బందులు క్షేత్రస్థాయిలో ఏర్పడుతు న్నాయి. విలీనం ప్రక్రియకు స్వస్తి చెప్పి యథాతథంగా కొనసాగించాలి.

Updated Date - 2021-11-23T06:40:55+05:30 IST