‘స్కూల్స్‌ మ్యాపింగ్‌ సకాలంలో పూర్తి చేయాలి’

ABN , First Publish Date - 2022-01-22T06:19:50+05:30 IST

స్కూల్స్‌కు సంబంధించిన మ్యాపింగ్‌ను సకాలంలో పూర్తి చేయాలని రామచంద్రపురం ఉపవిద్యాశాఖాధికారి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎంఈవోలకు సూచించారు.

‘స్కూల్స్‌ మ్యాపింగ్‌ సకాలంలో పూర్తి చేయాలి’

రామచంద్రపురం, జనవరి 21: స్కూల్స్‌కు సంబంధించిన మ్యాపింగ్‌ను సకాలంలో పూర్తి చేయాలని రామచంద్రపురం ఉపవిద్యాశాఖాధికారి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎంఈవోలకు సూచించారు. స్కూల్స్‌ మ్యాపింగ్‌ కార్యక్ర మంలో భాగంగా కృత్తివెంటి పేర్రాజు పంతులు ఉన్నత పాఠ శాలలో శుక్రవారం హెడ్‌ మాస్టర్స్‌, మండల విద్యా శాఖాధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కూల్‌ మ్యాపింగ్‌కు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని సభ్యులకు సూచించారు. సమా వేశంలో ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు లేవనెత్తిన అనేక సందేశాలకు సమాధానమిచ్చి మ్యాపింగ్‌కు త్వరగా పూర్తి చేయడానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమా నికి హాజరైన ప్రభుత్వ పరీక్షల నిర్వహణాధికారి డి.దేవానం దరెడ్డి స్కూల్‌ మ్యాపింగ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తు న్నారు. పరీక్షల జిల్లా అధికారి ఎస్‌.వి.రాజశేఖర్‌ మాట్లా డుతూ ఎన్‌ఎంఎంఎస్‌ ఎక్కువమంది విద్యార్థులతో రాయిం చాలని,  ఆధార్‌ ద్వారా పేర్లను తీసుకోవాలని సూచించారు.  డీసీసీబీ సెక్రటరీ ఎం.వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కోశాఽధికారి సి.వి.వి.సత్యన్నారాయణ, డివిజన్‌ అధ్యక్షులు సాలెమ్‌ రాజు, కార్యదర్శి బి.వి.రాజు, వెంకటరాజు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:19:50+05:30 IST