పాఠశాలల మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

Published: Fri, 21 Jan 2022 00:19:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పాఠశాలల మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలిసమీక్షలో మాట్లాడుతున్న మునిసిపల్‌ ఆర్డీ సత్యనారాయణ

  • ప్రధానోపాధ్యాయులతో సమీక్షలో మునిసిపల్‌ ఆర్డీ సత్యనారాయణ

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20: పాఠశాల మ్యాపింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మునిసిపల్‌ ఆర్డీ ఎన్‌వీవీ సత్యనారాయణ ఆదేశించారు. స్థానిక కోటగుమ్మం మండల వనరుల కేంద్రంలో గురువారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి 1నుంచి 3 కిలోమిటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలోకి అనుసంధానం చేసే మ్యాపింగ్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం డీఐ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు వారి స్కూల్స్‌ లాగిన్‌లో ఈ ప్రక్రి య పూర్తి చేసి కార్యాలయానికి పంపించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యాపింగ్‌ జరగాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ పాఠశాల డీవైఈవో దుర్గాప్రసాద్‌, స్కూల్‌ సూపర్‌వైజర్‌ సూరిబాబు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.