పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-05-22T05:13:39+05:30 IST

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారులు డాక్టర్‌ సృజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు. శనివారం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏఎన్‌ఎం యాప్‌ ద్వారా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వసతి గృహంలో పాఠశాల ఆవరణంలో చేస్తున్న పరిశుభ్రత సర్వే కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాల ఆవరణలో వృథా నీటి నిల్వలు, దోమలు వృద్ధి, చెత్తకుప్పలు, తాగునీటి నాణ్యతలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలి
తాగునీటి కుళాయిలను పరిశీలిస్తున్న వైద్యాధికారులు

నందలూరు, మే 21: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారులు డాక్టర్‌ సృజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు. శనివారం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏఎన్‌ఎం యాప్‌ ద్వారా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వసతి గృహంలో పాఠశాల ఆవరణంలో చేస్తున్న పరిశుభ్రత సర్వే కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాల ఆవరణలో వృథా నీటి నిల్వలు, దోమలు వృద్ధి, చెత్తకుప్పలు, తాగునీటి నాణ్యతలను పరిశీలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో వెంకట్‌నారాయణ, ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, ఆరోగ్య కార్యకర్తలు లక్షుమయ్య, కోటేశ్వరమ్మ, అంజినమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:13:39+05:30 IST