పాఠశాలల ప్రారంభంపై 19న cm సమావేశం

ABN , First Publish Date - 2021-10-17T16:30:35+05:30 IST

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తోపాటు మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా

పాఠశాలల ప్రారంభంపై 19న cm సమావేశం

బెంగళూరు: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తోపాటు మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో 6 నుంచి 12 తరగతులు ప్రారంభమయ్యాయి. 1 - 5 తరగతులను ప్రారంభించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దసరా ముగిసిన వెంటనే పా ఠశాలలు తెరుచుకోనున్నాయని ఇటీవలే విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కీలకభేటీలోనే తీర్మానం కానుందని అధికారవర్గా లు ప్రకటించాయి. ఈ మేరకు మంత్రులు సుధాకర్‌, బీసీ నాగేశ్‌, శ్రీరాములతోపాటు విద్యాశాఖ అధికారులు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులకు సమాచారం చేరవేశారు. 

Updated Date - 2021-10-17T16:30:35+05:30 IST