ప్రతీ రోజు స్కూళ్లు తనిఖీ చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-04T05:27:38+05:30 IST

3: డీఈవోలు, ఎంఈవోలు, స్కూల్‌కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లు ప్రతీ రోజు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు.

ప్రతీ రోజు స్కూళ్లు తనిఖీ చేయాలి: కలెక్టర్‌
కోర్టు కాంప్లెక్స్‌ భవనానికి స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు, జడ్జి ఎస్‌.ప్రేమావతి

మహబూబ్‌నగర్‌ రూరల్‌/భగీరథ కాలనీ, మా ర్చి3: డీఈవోలు, ఎంఈవోలు, స్కూల్‌కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లు ప్రతీ రోజు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన బండమీదపల్లిలోని యూపీఎ స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం యూ సుఫ్‌ లీవ్‌ లెటర్‌ ఇవ్వకుండా పాఠశాలకు రాకపో వడంతో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని డీఈవో ను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రా న్ని తనిఖీ చేశారు. నూతన కోర్టు కాంప్లెక్స్‌ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని జిల్లా జడ్జి ఎస్‌.ప్రేమావతితో కలిసి పరిశీలించారు. అనంత రం టీటీడీసీలో జరిగిన ఏపీఎం, సీసీల సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సమావేశంలో అదనపు పీడీ శారద పాల్గొన్నారు.  


పెద్ద సైజ్‌ బ్యాలెట్‌ బాక్స్‌లను సేకరిస్తున్నాం

మహబూబ్‌నగర్‌, కలెక్టరేట్‌: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అవసరమైన పెద్ద సైజ్‌ బ్యాలెట్‌ బాక్సులను సమీకరిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అదనపు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ బుద్ద ప్రకాష్‌ జ్యోతి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అలాగే ఎస్పీ రెమారా జేశ్వరితో కలిసి ఎన్నికల శాంతి భద్రతలపై అధి కారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-04T05:27:38+05:30 IST