ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2021-03-01T04:19:14+05:30 IST

జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం
ప్రయోగాలను పరిశీలిస్తున్న అధ్యాపకులు


ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారతరత్న, నోబెల్‌ గ్రహిత సీవీ రామన్‌ శాస్త్రవేత్త సృష్టించిన రామన్‌ఎఫెక్ట్‌ను ప్రపంచం గుర్తించిన రోజున సైన్స్‌ దినోత్సవంగా జరుకుంటామని వైస్‌ ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ రహీం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్‌ పరికరాలు తయారు చేసి ప్రదర్శన చేపట్టగా అధ్యాపకులు పరిశీలించారు. కార్యక్రమంలో జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌, అధ్యాపకులు ఉపేందర్‌, ఎల్లయ్య, ఉపేందర్‌, సైదులు, పండిత్‌, రామకృష్ణచారి, బ్రహ్మచారి, కవిత, కమల, మహేష్చంద్ర, సతీష్‌, రమేష్‌, సంపత్‌, మారుతి, శ్రీనివాస్‌, కృష్ణ, సురేందర్‌, నరేష్‌, రాజన్న, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:19:14+05:30 IST