టీనేజర్‌కు ఇంట్లోనే కరోనా టీకా.. సైన్స్ టీచర్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-07T02:55:16+05:30 IST

ఎవరికీ చెప్పకుండా తన కొడుకు స్నేహితుడికి ఇంట్లోనే కరోనా టీకా వేసిన సైన్స్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

టీనేజర్‌కు ఇంట్లోనే కరోనా టీకా.. సైన్స్ టీచర్ అరెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: ఎవరికీ చెప్పకుండా తన కొడుకు స్నేహితుడికి ఇంట్లోనే కరోనా టీకా వేసిన సైన్స్ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. నిందితురాలిని లారా రూస్సోగా స్థానిక పోలీసులు గుర్తించారు. లాంగ్‌ ఐలాండ్ ప్రాంతంలోని హెండ్రిక్క్స్ స్కూల్‌లో రూసో జీవశాస్త్రాన్ని బోధిస్తున్నారు. జనవరి 1న ఆమె ఆ టీనేజర్‌కు జాన్సన్ అండ్ జాన్సన్‌ టీకా ఇచ్చారట. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆమె వైద్యపరమైన ఎటువంటి అనుభవం లేదని స్థానిక మీడియా చెబుతోంది. అంతేకాకుండా.. ఆ టీనేజర్ తల్లిదండ్రులకు చెప్పకుండానే ఇలా చేసిందని సమాచారం. దీంతో.. స్థానికులు మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆమె చేతికి టీకా ఎలా చిక్కిందా అని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-01-07T02:55:16+05:30 IST