TOMATTO: టమాటాలతో.. డి- విటమిన్‌ మాయం..!

ABN , First Publish Date - 2022-07-13T20:51:06+05:30 IST

ఈ మధ్యకాలంలో చాలామంది డి- విటమిన్‌ సమస్యతో బాధపడుతున్నారు.. ఉదయాన్నే సూర్యరశ్మిలో డి-విటమిన్‌ పుష్కలంగా లభిస్తున్నా.. బిజీలైఫ్‌ కారణంగా ఎండలో నిలబడేంత టైం..

TOMATTO: టమాటాలతో.. డి- విటమిన్‌ మాయం..!

ఈ మధ్యకాలంలో చాలామంది డి- విటమిన్‌ సమస్యతో బాధపడుతున్నారు.. ఉదయాన్నే సూర్యరశ్మిలో డి-విటమిన్‌ పుష్కలంగా లభిస్తున్నా.. బిజీలైఫ్‌ కారణంగా ఎండలో నిలబడేంత టైం లేకుండా పోయింది. దీంతో డి-విటమిన్‌ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే మనం తీసుకునే ఆహారంలో డి- విటమిన్‌ అందే అవకాశాలు చాలా తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణం.. ఈ నేపథ్యంలో ఆహారం ద్వారా సమృద్ధిగా డి- విటమిన్ అందించడంపై ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ ఇన్నెస్ సెంటర్ వృక్ష శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. టమాటాల్లో గణనీయంగా డి- విటమిన్ ఉత్పత్తి అయ్యేలా పరిశోధనలు చేశారు. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు టమాటాల్లో క్రిస్పర్ టెక్నాలజీతో జన్యుమార్పిడి చేసి.. వాటిల్లో సమృద్ధిగా విటమిన్- డి తయారు చేశారు.


ఈ జన్యుమార్పులు చేసిన ఒక్కో  టమాటాలో రెండు కోడి గుడ్లలో ఉండేటంత డి- విటమిన్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే టమాటాలను ఎండబెట్టడం ద్వారా దీని పరిమాణం మరింతగా పెరుగుతుందని వెల్లడించారు. ఒక్క టమాటాలే కాకుండా వంకాయ, ఆలుగడ్డల్లో కూడా క్రిస్పర్ సాంకేతికత సాయంతో డి- విటమిన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే ఈ టమాటాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

Viral Video: సముద్రపు ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. యువతుల నిర్లక్ష్యం ఎంత పని చేసింది.. అంత చూస్తుండగా..





Updated Date - 2022-07-13T20:51:06+05:30 IST