Kuwait లో భారీ సంఖ్యలో ప్రవాసుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-15T18:49:43+05:30 IST

గత కొన్ని రోజులుగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

Kuwait లో భారీ సంఖ్యలో ప్రవాసుల అరెస్ట్

కువైత్ సిటీ: గత కొన్ని రోజులుగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ, రెసిడెన్సీ ఎఫైర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రెసిడెన్సీ ఉల్లంఘనదారులు భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హవాలీ గవర్నరెట్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో 34 మంది ప్రవాసులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమ రెసిడెన్సీ గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా ఆ దేశంలో ఉంటున్నట్లు తెలిపారు. అలాగే మరో చోట నిర్వహించిన తనిఖీల్లో మరో 26 మంది ఉల్లంఘనదారులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.గృహ కార్మికులను రిక్రూట్ చేసే ఓ ఫేక్ ఆఫీస్‌పై అధికారులు ఆకస్మీక దాడి నిర్వహించారు. దీంతో అక్కడ 26 మంది ప్రవాసులు దొరికినట్లు తెలియజేశారు.


ఇటీవల దేశవ్యాప్తంగా వరుస సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఇలా భారీ సంఖ్యలో వలసదారులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడి పట్టుబడుతున్నారు. సంబంధిత అధికారులు కూడా ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాలపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే కువైత్ అధికారులు అమ్నెస్టీ పథకం కింద పలుమార్లు నివాస గడువు ముగిసిన ప్రవాసులను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. కానీ, చాలామంది దాన్ని ఉపయోగించుకోలేదు. నివాస అనుమతి గడువు ముగిసిన కూడా చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడంతో పాటు జీవితంలో మళ్లీ కువైత్ రాకుండా నిషేధం విధించడం జరుగుతుంది.  

Updated Date - 2022-07-15T18:49:43+05:30 IST