ఉద్యోగోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-08T03:39:48+05:30 IST

జిల్లాలో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్ల ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది.

ఉద్యోగోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు

ఒంగోలు (విద్య), అక్టోబరు 7 : జిల్లాలో గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్ల ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. స్థానిక సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్‌ ప్రారంభించారు. సీనియర్‌ హెచ్‌ఎంలు పది మంది, డీఈవో కార్యాలయ సిబ్బంది పరిశీలన కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించారు. హెచ్‌ఎం ప్రమోషన్‌కు 83 మందికి 77 మంది, ఎస్‌ఏ ఇంగ్లీషుకు 229కి 211 మంది, గణితంలో 137కి 131 మంది, జీవశాస్త్రంలో 15కి ఏడుగురు, సాంఘిక శాస్త్రంలో ఆరుగురికి నలుగురు, ఉర్దూలో 8 మందికి ఎనిమిది మంది పరిశీలనకు హాజరయ్యారు.  


ముగ్గురు ఎంఈవోలకు మెమోలు 

మధ్యలో బడి మానేసిన పిల్లల (డ్రాప్‌ అవుట్స్‌)ను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంలో విఫలమైన ముగ్గురు మండల విద్యాధికారులకు మెమోలు జారీ చేసినట్లు డీఈవో విజయభాస్కర్‌ తెలిపారు. డ్రాప్‌ అవుట్లను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంలో 20శాతంలోపు మాత్రమే ప్రగతి సాధించినందుకు వెలిగండ్ల, హెచ్‌ఎంపాడు, కొమరోలు ఎంఈవోలపై చర్యలకు కలెక్టర్‌ ఆదేశించారు. ఆమేరకు మెమోలు ఇచ్చినట్లు తెలిపారు.  ఈ ముగ్గురు స్వయంగా తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాలన్నారు. రెండు రోజుల్లో  ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. 


Updated Date - 2022-10-08T03:39:48+05:30 IST