డీఎస్సీ-98 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-07T05:36:37+05:30 IST

డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలో మినిమం టైం స్కేలుతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేసేందుకు ఆమోదం తెలిపిన డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని జిల్లా విద్యాశాఖధికారి విజయభాస్కర్‌ తెలిపారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో గురువారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆయన ప్రారంభించారు. పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

డీఎస్సీ-98 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
సర్టిఫికెట్ల పరిశీలనలో మాట్లాడుతున్న డీఈవో విజయభాస్కర్‌

ఆమోదం తెలిపిన అందరికి ఉద్యోగాలు

జిల్లా విద్యాశాఖధికారి విజయభాస్కర్‌

ఒంగోలు(విద్య), అక్టోబరు 6 : డీఎస్సీ 2008 అభ్యర్థుల తరహాలో మినిమం టైం స్కేలుతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేసేందుకు ఆమోదం తెలిపిన డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని జిల్లా విద్యాశాఖధికారి విజయభాస్కర్‌ తెలిపారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో గురువారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆయన ప్రారంభించారు. పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులు ఏమైనా ధ్రువపత్రాలను సమర్పించకపోతే వారితో వివరణ, విజ్ఞాపన పత్రాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా సర్టిపికెట్లు లభించలేదని తర్వాత సమర్పిస్తామని కొంతమంది అభ్యర్థులు డీఈఓ దృష్టికి తెచ్చారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆన్‌లైన్‌లో సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలిస్తామని, అర్హులైన వారందరికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.

10 టీంలు ఏర్పాటు

అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు పది టీంలను ఏర్పాటు చేశారు. వీరు ఈనెల 6 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటారు. మొదటిరోజు 1 నుంచి 200 నంబర్ల అభ్యర్థులను పరిశీలనకు పిలిచారు. మార్గదర్శకాల ప్రకారం అన్నిరకాల  సర్టిఫికెట్లను పరిశీలించారు. కాగా 25ఏళ్ల తర్వాత తమ పోరాట ఫలితంగా సీఎం తమకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-10-07T05:36:37+05:30 IST