వంశధార పనుల్లో జాప్యంపై ఎస్‌ఈ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-04T04:53:14+05:30 IST

వంశధార వరద కాలువ పనుల్లో జాప్యం జరగడంపై ఎస్‌ఈ డోల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 87వ ప్యాకేజీ పనులను పరిశీలించారు.

వంశధార పనుల్లో జాప్యంపై ఎస్‌ఈ ఆగ్రహం



భామిని: వంశధార వరద కాలువ పనుల్లో  జాప్యం జరగడంపై  ఎస్‌ఈ డోల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 87వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు   యంత్రాలు, కూలీలు సమకూర్చకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మార్చిలోగా పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కాంట్రాక్టు ప్రతినిధులను హెచ్చరిం చారు. కాట్రగడ వద్ద ఓపెన్‌హెడ్‌ చానల్‌, హెడ్‌ రెగ్యులేటర్‌, లైనింగ్‌ వర్క్‌, నులక జోడు ఇన్‌ఫ్లో పనులను పరిశీలించారు. హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద జనరేటర్‌ గేట్‌ ఆపరే టింగ్‌కు క్రేన్లు వేగవంతంగా చేయాలని సూచించారు. లైనింగ్‌ వర్క్‌ కూడా చేయా లన్నారు. సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వెళ్లే ఇన్‌ఫ్లో వాటర్‌పై వంతెన నిర్మిస్తే నులకజోడు గ్రామస్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. 

నేరడి బ్యారేజ్‌ నిర్మిస్తే పూర్తిస్థాయిలో నీటివినియోగం

నేరడి బ్యారేజ్‌ నిర్మిస్తేనే వంశధార నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చని ఎస్‌ఈ డోల తిరుపతిరావు తెలిపారు. ఇప్పటికే ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చిందని, ఒడిశాలో 106ఎకరాలకు భూసేకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇరువైపులా 3.5 కిలోమీటర్లు రక్షణగోడ ఏర్పాటు చేసి నిల్వ ఉన్న నీటితో 30వేల ఎకరాలకు కాలువ ద్వారా  నీరందిస్తామని  ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అయినా ఆ ప్రభుత్వం మొండివైఖరి వల్లే బ్యారేజ్‌  పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఆయనతోపాటు ఈఈ రామచంద్రరావు, డీఈలు గాయత్రి, చంద్రకుమార్‌, సుశీలరాణి, రామకృష్ణతోపాటు ఏఈలు ఉన్నారు.  



Updated Date - 2020-12-04T04:53:14+05:30 IST