బోటుపై నుంచి జారిపడి మృతి

ABN , First Publish Date - 2020-12-03T05:50:58+05:30 IST

సముద్రంలో చేపల వేటకెళుతుండగా బోటుపై నుంచి జారిపడి పక్కనే ఉన్న ఇంజన్‌ బోటు పంకాలో పడడంతో ఓ మత్స్యకారుడు మృతిచెందాడు.

బోటుపై నుంచి జారిపడి మృతి

కొత్తపల్లి, డిసెంబరు 2: సముద్రంలో చేపల వేటకెళుతుండగా బోటుపై నుంచి జారిపడి పక్కనే ఉన్న ఇంజన్‌ బోటు పంకాలో పడడంతో ఓ మత్స్యకారుడు మృతిచెందాడు.  కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నంకు చెందిన మత్స్యకారుడు మోసా కనకరాజుకు సొంతంగా ఫైబర్‌ ఇంజన్‌ బోటు ఉంది. ఈ బోటుపై కనకరాజు ఇద్దరు కుమారులతో పాటు మిగతా మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లారు. ఇంజన్‌ బోట్‌ డెక్‌పై నిలబడి బోటును నడుపుతున్న  మోసా కనకరాజు (53) అదుపు తప్పి బోటుపై నుంచి సముద్రంలో పడిపోయాడు. ఈలోగా వెనకాలే వస్తున్న మరొక ఫైబర్‌ ఇంజన్‌ బోటు కింద పడిపోవడంతో సముద్రంలో గల్లంతయ్యాడు. అనంతరం కొంతసేపటికి ఉప్పాడ సముద్రతీరానికి కనకరాజు మృతదేహం కొట్టుకువచ్చింది. పంకా తగిలి శరీరంలోని ఎముకలు విరిగి బయటకు రావడంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఉప్పాడ మాజీ సర్పంచ్‌, వైసీపీ నాయకుడు ఉమ్మిడి జాన్‌ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఠాపురం  సీఐ రాజశేఖర్‌, కొత్తపల్లి ఇన్‌చార్జి ఎస్‌ఐ పార్థసారఽథి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  


Updated Date - 2020-12-03T05:50:58+05:30 IST