
ఎన్నారై డెస్క్: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల సూట్‌కేసులు, లగేజీ కన్వేయర్ బెల్టుపై గుట్టలుగుట్టలు పేరుకుపోయాయి. శుక్రవారం ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన ఈ సీన్ ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. ఎయిర్‌పోర్టులోంచి బయటకు వస్తున్న పలువురు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దృశ్యాలను తామెప్పుడూ చూడలేదంటూ ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌పోర్టు తాజాగా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. త్వరలో లగేజీని ప్రయాణికులకు చేరుస్తామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి