Asani Cyclone: ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలం

ABN , First Publish Date - 2022-05-11T13:59:30+05:30 IST

అసనీ తుఫాను ప్రభావంతో ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Asani Cyclone: ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలం

కాకినాడ: అసనీ(Asani) తుఫాను ప్రభావంతో ఉప్పాడ, తొండంగిలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడలో కోనపాపపేట తదితర గ్రామాల్లో అలల ఉధృతికి 18 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లన్నీ కడలిలో కలిసిపోయాయి. భారీ కెరటాల తాకిడికి తొండంగిలో హెచరీల పైపులైన్లు ధ్వంసమయ్యాయి. భారీ గాలులకు మామిడి, జీడికి భారీ నష్టం వాటిల్లింది. కాకినాడ పోర్టులో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు రద్దయ్యాయి. 

Read more