‘జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

Jun 23 2021 @ 00:11AM
వట్లూరులో జ్వరాలపై అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పెదపాడు, జూన్‌ 22 : తీవ్రమైన చలి, వణుకుతో కూడిన జ్వరం మలేరి యా కావచ్చని వర్షాకాలంలో వచ్చే జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండా లని వట్లూరు పీహెచ్‌సీ డాక్టర్‌ భారతి తెలిపారు. మలేరియా నివారణ మాసోత్సవాల్లో భాగంగా పీహెచ్‌సీ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించేం దుకు ర్యాలీని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ మలేరియా జ్వరాలు ఆడ అనాఫిలస్‌ దోమలు కుట్టడం వల్ల వస్తాయ న్నారు. ఏలూరు డివిజన్‌ మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి గోవిందరావు మాట్లాడుతూ మలేరియాతో కామెర్లు, రక్తహీనత, మెదడకు సంబంధించి వ్యాధులు సంభవిస్తాయన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో కృష్ణారావు, పీహెచ్‌ఎన్‌ నాగమల్లేశ్వరి, ఎంపీహెచ్‌ఎస్‌ అనురాధ, ఆశా, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

దెందులూరులో..

దెందులూరు, జూన్‌ 22 : కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్లార్చిన నీరు తాగాలని గోపన్నపాలెం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ త్రినాథ్‌రెడ్డి అన్నారు. గోపన్నపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం తదితర వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది ఆనారోగ్యం భారిన పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించి శానిటైజర్‌తో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.