సీజన్‌కు తగ్గట్టుగా!

ABN , First Publish Date - 2021-02-21T06:07:30+05:30 IST

‘‘చల్లగాలులు తగ్గి ఎండలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో చర్మ సంరక్షణలో మార్పులు అవసరం’’ అంటున్నారు సౌందర్య నిపుణురాలు మహిమా గుప్తా. స్కిన్‌కేర్‌ గురించి ఆమె చెబుతున్న సూచనలివి...

సీజన్‌కు తగ్గట్టుగా!

‘‘చల్లగాలులు తగ్గి ఎండలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో చర్మ సంరక్షణలో మార్పులు అవసరం’’ అంటున్నారు సౌందర్య నిపుణురాలు మహిమా గుప్తా. స్కిన్‌కేర్‌ గురించి ఆమె చెబుతున్న సూచనలివి... 

  1. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. చర్మం హైడ్రేట్‌గా ఉండేందుకు టోనర్‌ ఉపయోగించాలి. 
  2. వేసవిలో తేలికగా ఉండి తొందరగా గ్రహించగలిగే ఫేషియల్‌ క్రీమ్స్‌ వాడాలి.
  3. చలికాలంలో కన్నా వేసవిలో సూర్యుని తాపం ఎక్కువ కాబట్టి బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ రాసుకోవడం మరచిపోవద్దు. 
  4. ఎండలో చెమట పట్టడం, కాలుష్యం వల్ల చర్మంపై మురికి చేరి చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. పొడి చర్మం ఉన్నవారి కన్నా జిడ్డు చర్మం గలవారు మృతకణాలను ఎక్కువగా తొలగించుకోవాల్సి ఉంటుంది. అయితే తరచుగా మృతకణాలను తొలగించడం మంచిది కాదు.

Read more