సెబ్‌ సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు

ABN , First Publish Date - 2022-08-11T05:38:02+05:30 IST

రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మస్తానయ్య, సెంట్రీ కానిస్టేబుల్‌ శ్రీహరిలను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ బుధ వారం ఆదేశాలు జారీచేశారు.

సెబ్‌ సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై వేటు
పొంగుటూరులో ఆందోళన చేస్తున్న ఆర్య వైశ్య సంఘం నాయకులు, వ్యాపారులు

 డీపీజీ ఆదేశాలు.. సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు

 చిరు వ్యాపారి మృతిపై విచారణ అధికారిగా ఏఎస్పీ

 న్యాయం కోసం ఆర్య వైశ్య నాయకుల ఆందోళన

 పొంగుటూరులో రాస్తారోకో.. అధికారుల హామీతో ఆందోళన విరమణ


ఏలూరు కలెక్టరేట్‌/కొయ్యలగూడెం, ఆగస్టు 10 : రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్‌ ఎన్‌ఫోర్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) స్టేషన్‌ ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మస్తానయ్య, సెంట్రీ కానిస్టేబుల్‌ శ్రీహరిలను  సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ బుధ వారం ఆదేశాలు జారీచేశారు. కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన కిరాణా వ్యాపారి కొల్లూరి దుర్గా రావును ఈ నెల 5న సెబ్‌ పోలీసులు బెల్లం అమ్ముతున్నా డంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే మంగళవారం దుర్గారావు ఏలూరు రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. దుర్గా రావు మృతికి సెబ్‌ అధికారులే కారణమంటూ కొయ్యలగూడెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద బంధువులు ఆందోళన చేశారు. సెబ్‌ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిం చారని వారి ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచా రణ అధికారిగా ఏఎస్పీ చక్రవర్తిని ఎస్పీ నియమించారు. 

బాధితుల ఆందోళన.. విరమణ

చిరు వ్యాపారి దుర్గారావు మృతిపై బుధవారం పొంగు టూరులో మృతుడి బంధువులు, గ్రామ స్థులు, ఆర్య వైశ్య నాయకులు ఆందోళన చేశారు. మంగళవారం ఏలూరులో మృత దేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే ఎస్‌ఈబీ అధికారులు బంధువులకు అప్ప జెప్పకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో పొంగుటూరు తీసుకొచ్చారు. తమకు తెలియ కుండా దొంగచాటుగా ఎందుకు తీసుకొచ్చారని మృతదేహం తీసుకోబోమని మృతుని బంధువులు భీష్మించారు. దీంతో జంగారెడ్డిగూడెం సీఐ బాల సురేష్‌బాబు, కొయ్యలగూడెం ఎస్సై విష్ణువర్థన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పటికీ వారు శాంతించ లేదు. మలేషియా వెళ్లిన తమ సోదరుడు సత్తిబాబు వచ్చేవరకు మృతదేహం తీసుకోబోమని తెలిపారు. దీంతో మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి పొంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారు. బుధవారం ఉదయం సత్తిబాబు వచ్చాక బంధువులు, గ్రామస్థులు, ఆర్య వైశ్య నాయకులు పెద్దఎత్తున పొంగుటూరు తరలివచ్చారు. దుర్గారావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రధాన సెంటర్‌లో సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఎస్‌ఈబీ సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ళను సస్పెండ్‌ చేశారని శాంతించాలని బాధితులను సీఐ, ఎస్సై కోరారు. జిల్లా ఎస్పీ వచ్చి తమకు న్యాయం చేస్తామని చెప్పే వరకు రాస్తారోకో విరమించబోమని తేల్చి చెప్పడంతో జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ ఘటనా స్థలానికి వచ్చారు. మీ డిమాండ్లన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మాజీ ఎంపీపీ మట్టా సత్తిపండు ఎమ్మెల్యే బాలరాజుతో ఫోన్‌లో మాట్లాడి బాధితులను ఆదుకుం టామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఆర్యవైశ్య నాయకులు కోనా శ్రీనివాసరావు, రంగ ప్రసాద్‌, శ్రీరామమూర్తి, వెలగా శ్రీరామ మూర్తి, శ్రీనివాస్‌, పొంగుటూరు సర్పంచ్‌ అడపా రాంబాబు తదితరులు పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. 


Updated Date - 2022-08-11T05:38:02+05:30 IST