పాత సామాన్లు కాదు..!

ABN , First Publish Date - 2022-05-16T06:55:02+05:30 IST

ఇదేమీ పాత సామాన్ల దుకాణం కాదు.. ఇక్కడన్నుది స్ర్కాప్‌ సామను కూడా కాదు.. యానాం నుంచి మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలివి. వీటిని పెట్టేందుకు స్థలం లేక ఎస్‌ఈబీ అధికారులు ఒకదానిపై ఒకటి స్ర్కేప్‌ షెడ్డులో పడవేసినట్లుగా వాహనాలను పడేశారు. వీటిపై పిచ్చిమొక్కల తీగలు పెరిగిపోయి వాహనాలు కనిపించకుండా మూసివేశాయి.

పాత సామాన్లు కాదు..!
తాళ్లరేవు ఎస్‌ఈబీ కార్యాలయంలో పేరుకుపోయిన వాహనాలు

  • ఎస్‌ఈబీ పోలీసులకు పట్టుబడిన వాహనాలు

తాళ్లరేవు, మే 15: ఇదేమీ పాత సామాన్ల దుకాణం కాదు.. ఇక్కడన్నుది స్ర్కాప్‌ సామను కూడా కాదు.. యానాం నుంచి మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలివి. వీటిని పెట్టేందుకు స్థలం లేక ఎస్‌ఈబీ అధికారులు ఒకదానిపై ఒకటి స్ర్కేప్‌ షెడ్డులో పడవేసినట్లుగా వాహనాలను పడేశారు. వీటిపై పిచ్చిమొక్కల తీగలు పెరిగిపోయి వాహనాలు కనిపించకుండా మూసివేశాయి. సుంకరపాలెం, పి.మల్లవరం సెబ్‌ అధికారులు, మొబైల్‌ పార్టీలు పట్టుకున్న వాహనాలన్నింటినీ తాళ్లరేవు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌కు తరలిస్తారు. ఐదేళ్లుగా వాహనాలు ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. కార్యాలయం లోపల కూడా వాహనాలే ఉన్నాయి. పైస్థాయి అధికారులనుంచి అనుమతులు వచ్చిన తర్వాత వీటిని ట్రాన్స్‌పోర్టు అధికారులు చెక్‌ చేసి వేల్యూ కడతారు. వీటిపై ఎస్‌ఈబీ ఎస్‌ఐ వీజే భవానిని వివరణ కోరగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే వేలంపాట ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-16T06:55:02+05:30 IST