Advertisement

సెబ్‌కు సిబ్బంది ఏరీ?

Dec 3 2020 @ 00:52AM

 కొత్త సంస్కరణల అమలుకు సిద్ధం.. పీడిస్తున్న సిబ్బంది కొరత

  మద్యం, ఇసుక రవాణా కట్టడి విధులతోపాటు తాజాగా గంజాయి రవాణా, 

ఆన్‌లైన్‌ జూదంపై ఉక్కుపాదం మోపాలని హుకుం 

  సిబ్బంది లేమితో ఎస్‌ఈబీ విభాగం నరకయాతన 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ). దీన్నే ‘సెబ్‌’ అంటున్నారు. ఇసుక, మద్యం అనధికారిక రవాణా అదుపునకు ఆయా శాఖల చేతుల్లో ఉన్న అధికారాలన్నీ సెబ్‌కు ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీస్‌, ఎక్సైజ్‌ మాతృ శాఖల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బందిని సెబ్‌కు బదలాయించింది. వాస్తవానికి కొత్త సంస్కరణ చేసేటప్పుడు సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా, లేకపోతే కొత్త సిబ్బందితో సదరు సంస్కరణ అమలు చేయాలనే ప్రోటోకాల్‌ పాటించాల్సిన ప్రభుత్వం ఆ ప్రోటోకాల్‌ ఉల్లంఘించింది. ప్రస్తుత జిల్లా ఆబ్కారీ శాఖలో ఉన్న సిబ్బంది 70 శాతం సెబ్‌కు, 30 శాతం సొంత శాఖకు పరిమితం చేసింది. ఆబ్కారీ శాఖ 30 శాతం సిబ్బందిలో ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రభుత్వ మద్యం షాఫులు, లైసెన్స్‌తో నడుస్తున్న బార్‌ల్లో అమ్మకాలకే పరిమితం చేసింది. సెబ్‌లో పనిచేస్తున్న ఆబ్కారీ, పోలీస్‌ సిబ్బంది ఇప్పటివరకు ఇసుక, మద్యం అనధికారిక రవాణా, పరిశ్రమల్లో కార్మికుల సేఫ్టీపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కాలంలో గంజాయి తరలింపు, ఆన్‌లైన్‌ జూదం ఎక్కువ అవుతుండడంతో వీటిని అరికట్టాలని సెబ్‌కు ఈ రెండింటిపై నియంత్రణ ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా సెబ్‌ ఏఎస్పీని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని కార్యాచరణ అమలుకు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ దిశగా ఏఎస్పీ చర్య లకు ఉపక్రమించారు. కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల తగిన సిబ్బంది లేకపోయినా నరకయాతన పడి మరీ లక్ష్యాలను ఛేదించాల్సిన దుస్థితి నెలకొంది. మెట్ట, తీర ప్రాంతాల్లో నాటుసారా తయారీ, ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంటపై ఆరా తీయాలని ఉన్న సిబ్బందితోనే సెబ్‌ సమాయత్తమవుతోంది. కరోనా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో గంజాయి, సారా మాఫియా అధికారుల కళ్లుగప్పి సొమ్ము చేసుకోవాలని యత్నించిన ఎత్తులను సెబ్‌ చిత్తు చేసింది. తీర ప్రాంతాల్లో మడ అడ వుల్లో సారా బట్టీలను నేలమట్టం చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వీర్యం చేయడానికి సరిపడా సిబ్బంది లేకపోయినా ముందుకు వె ళ్తోంది. గంజాయి తరలింపు దారులపై నిఘా పెట్టింది. సెబ్‌ ఏర్పడినప్పటి నుంచి ఎక్సైజ్‌ నేరాల అదుపులో ఆశా జనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చేసిన దాడులు, తనిఖీల్లో 22 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 214 మందిపై కేసులు నమోదు చేశారు. 300 మందిని అరెస్టు చేశారు. 112 వాహనాలను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 90 వాహనాలను సీజ్‌చేసి, 65 మందిపై కేసులు పెట్టారు. వీరి నుంచి సుమారు 3 లక్షల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెబ్‌ ఏఎస్సీ సుమిత్‌ గరుడ్‌ మాట్లాడుతూ సెబ్‌ పరిధిలో సారా, అనధికారిక మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, పూర్తి స్థాయి అదుపునకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తన హయాంలో ఇప్పటివరకు సారాకు వినియోగించే బెల్లం ఊట 25 లక్షల లీటర్లను ధ్వంసం చేశామని, ఇది ఏపీ రికార్డు అని చెప్పారు.
Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.