అరబిందో ఫార్మాకు సెబీ వార్నింగ్‌ లెటర్‌

ABN , First Publish Date - 2022-06-28T06:52:58+05:30 IST

అరబిందో ఫార్మాకు సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది.

అరబిందో ఫార్మాకు సెబీ వార్నింగ్‌ లెటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మాకు సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. కంపెనీకి చెందిన యూనిట్‌-1లో 2019 నుంచి 2022 మధ్య కాలంలో  యూఎ్‌సఎ్‌ఫడీఏ చేపట్టిన ఆడిట్‌ సందర్భంగా వెల్లడించిన లోపాలపై అరబిందో ఫార్మా పూర్తి సమాచారాన్ని అందించలేదని, అరకొర వివరాలను మాత్రమే వెల్లడించిందని వార్నింగ్‌ లెటర్‌లో సెబీ పేర్కొంది. కాగా సెబీ నుంచి హెచ్చరిక లేఖ అందినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. పూర్తి సమాచారాన్ని అందించకపోవడానికి గల కారణాలను వెల్లడించకపోవడం తో పాటు ఎఫ్‌డీఏ లేవనెత్తిన లోపాలను కంపెనీ సీరియ్‌సగా తీసుకోలేదని కూడా సెబీ పేర్కొంది. సెబీ నిబంధనలకు అనుగుణంగా అందించాల్సిన సమాచారాన్ని కంపెనీ అందించాలని మార్గదర్శనం చేసింది. రానున్న డైరెక్టర్ల బోర్డు సమావేశంలో వార్నింగ్‌ లెటర్‌ను బోర్డు ముందు ఉంచాలని.. లెటర్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పంపాలని అరబిందో ఫార్మాను సెబీ ఆదేశించింది. హైదరాబాద్‌లోని యూనిట్‌-1లో అరబిందో ఫార్మా యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ)ను తయారు చేస్తోంది. 

Updated Date - 2022-06-28T06:52:58+05:30 IST