ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉంది: ఎఫ్‌జీజీ

ABN , First Publish Date - 2021-04-23T07:39:05+05:30 IST

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 జడ్‌ఏ ప్రకారం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని ఎన్నికలు వాయిదా వేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు.

ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉంది: ఎఫ్‌జీజీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 జడ్‌ఏ ప్రకారం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుని ఎన్నికలు వాయిదా వేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పుడే అధికార పార్టీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల కారణంగానే రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరిగిందని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు, రాజకీయ పార్టీల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కరోనా తీవ్రత దృష్ట్యా మునిసిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్‌ఈసీని.. ఉపాఽధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) కోరాయి. కరోనా తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించడం బాధ్యతారాహిత్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ ఓ ప్రకటనలో విమర్శించారు

Updated Date - 2021-04-23T07:39:05+05:30 IST