కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని తగ్గించిన కేంద్రం

Published: Sun, 20 Mar 2022 19:37:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య విరామం తగ్గింది. ఇప్పటి వరకు ఈ టీకా తొలి డోసు-రెండో డోసుకు మధ్య 12-16 వారాల విరామం ఉండగా, ఇప్పుడు అది 8-16 వారాలకు తగ్గింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టాగి) పేర్కొంది. కొవిషీల్డ్ రెండో టీకాను 8 వారాల తర్వాత ఇచ్చినప్పుడు, 12-16 వారాల తర్వాత ఇచ్చినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల ప్రతిస్పందన దాదాపు సమానంగా ఉన్నట్టు ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌టాగి ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తూ భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించడం వల్ల మిగిలిన 6-7 కోట్ల మందికి వ్యాక్సినేషన్ సులభమవుతుందని భావిస్తున్నారు.


భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా విషయంలో రెండు డోసుల మధ్య విరామంలో ఎలాంటి మార్పు లేదని ఎన్‌టాగి పేర్కొంది. ఈ టీకా రెండు డోసుల మధ్య విరామం 28 రోజులుగా ఉంది. కొవిషీల్డ్‌ టీకాను ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేశాయి. దీనికి పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.