రెండో రోజు... అదే జోరు

ABN , First Publish Date - 2022-10-02T06:01:36+05:30 IST

తారా ఆర్ట్స్‌ అకాడమీ సహకారంతో అంబేద్కర్‌ స్టేడియంలో కరీంనగర్‌ కళోత్సవాలు జోరుగా సాగుతున్నాయి.

రెండో రోజు... అదే జోరు
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌, మంత్రి గంగుల కమలాకర్‌

- ఆనందోత్సాహాల మధ్య కరీంనగర్‌ కళోత్సవాలు 

- హాజరైన మంత్రి గంగుల కమలాకర్‌

- ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌

 కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 1: తారా ఆర్ట్స్‌ అకాడమీ సహకారంతో అంబేద్కర్‌ స్టేడియంలో కరీంనగర్‌ కళోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం రెండో రోజు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగంగుల కమలాకర్‌, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలసి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. యాంకర్‌ శ్యామల వ్యాఖ్యానం చేయగా కళాకారులు ఆర్‌ఎస్‌ నంద హాస్యం, కనుకవ్వ, ఆకునూరి దేవయ్య, బుర్ర సతీశ్‌గౌడ్‌, మల్లిక్‌తేజ, కందుకూరి శంకర్‌బాబు, ఓరుగంటి శేఖర్‌, గడ్డం రమేశ్‌, పొద్దుపొడుపు శంకర్‌, అశ్వినీరాథోడ్‌ బృందాల పాటలు, శాంతిరాజు కొరియోగ్రఫీలో నృత్యం, బాలభవన్‌ చిన్నారుల నృత్యప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మేయర్‌ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పొన్నం అనిల్‌ కుమార్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T06:01:36+05:30 IST