రెండో డోసు మాత్రమే

ABN , First Publish Date - 2021-05-10T04:57:10+05:30 IST

జిల్లాలో ఈనెల 10 నుంచి 31 వరకూ అన్ని కేంద్రాల్లో రెండో డోసువారికి మాత్రమే కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తారని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొదటి డోస్‌వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం లేదన్నారు.

రెండో డోసు మాత్రమే

జూన్‌ మొదటివారంలో మళ్లీ మొదటి డోసు వ్యాక్సిన్‌ 

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టరేట్‌, మే 9: జిల్లాలో ఈనెల 10 నుంచి 31 వరకూ అన్ని కేంద్రాల్లో రెండో డోసువారికి మాత్రమే కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తారని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొదటి డోస్‌వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం లేదన్నారు. జూన్‌ మొదటి వారం నుంచి మాత్రమే మొదటి డోసు వ్యాక్సినేషన్‌ మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. మొదటి డోసు వాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న స్లాట్‌లు రద్దువుతాయన్నారు. రెండో డోసు తీసుకోవాల్సి ఉన్న వారందరికీ ఏ కేంద్రంలో, ఏ తేదీన వేసుకోవాలో అనేది వారి ఫోన్లకు సమాచారం ఇస్తామని లేదా ఫోన్‌ చేసి తెలియజేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వృథాను నివారించడంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో రెండో డోసు వేస్తారన్నారు. ఆయా కేంద్రంలో ఎంతమందికి వాక్సిన్‌ వేయాలో? ఏ ప్రాంతం వారికి వేయాలో? సంబంధించిన జాబితాను కూడా నిర్దేశిస్తారని పేర్కొన్నారు. ఇకపై వ్యాక్సిన్‌ను ఆరోగ్య కేంద్రానికి సమీపంలోని విశాలమైన ప్రదేశంలో స్కూల్‌, కళాశాల ప్రాంగణాల్లో చేపడతారని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. అందువల్ల రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వారెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారికి గడువులోగా రెండో డోసు ఇస్తామని పేర్కొన్నారు. పట్టణాల్లో అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వాక్సినేషన్‌ కేంద్రాల్లో సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు వ్యాక్సిన్‌ వేసుకునే వారికి నీడలో కూర్చొనే సదుపాయం కల్పిస్తారని తెలిపారు. 

నేడు కొవిడ్‌పై కలెక్టర్‌ టెలీ స్పందన 

కొవిడ్‌కు సంబంధించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకునేందుకు సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ టెలీ స్పందన  నిర్వహిస్తారు. కరోనా నియంత్రణ, చికిత్స, టెస్టులు తదితర అంశాలపై మాత్రమే ఆయన మాట్లాడతారు.  నెంబర్లు 08922-276712,08922-276713కు ఎవరైనా ఫోన్‌ చేసి తమ సమస్యలను కలెక్టర్‌కు తెలియజేయవచ్చు. అనంతరం ఆరోగ్యమిత్రలతో కలెక్టర్‌ మధ్యాహ్నం 3 గంటలకు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 


Updated Date - 2021-05-10T04:57:10+05:30 IST