31 వరకు రెండో డోస్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-05-11T05:04:56+05:30 IST

నగర పరిధిలో ఈ నెల 31 వరకు రెండోడోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌ పేర్కొన్నారు. నగరంలో ఆరు ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌ను ఇస్తున్నట్లు తెలిపారు.

31 వరకు రెండో డోస్‌ వ్యాక్సిన్‌
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌

ఆరు కేంద్రాల్లో పంపిణీ

సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌

కడప(ఎర్రముక్కపల్లె), మే 10: నగర పరిధిలో ఈ నెల 31 వరకు రెండోడోస్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌ పేర్కొన్నారు. నగరంలో ఆరు ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. కడప కార్పొరేషన్‌ సమావేశ మందిరంలో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ సుబ్బారావు అధ్యక్షతన సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన వారికి రెండో డోస్‌ టీకా ఇవ్వడం జరుగుతుందని, రెండో డోస్‌కు సంబంధించి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చినవారు మాత్రమే కేంద్రాలకు రావాలని సూచించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీకాలు వేస్తారని తెలిపారు. 


కేంద్రాలివే ...

చిన్నచౌకు కొండాయపల్లె ఎంపీపీ స్కూలు, హరిజనవాడ, యానాదికాలనీ, ఎంపీపీ తెలుగు స్కూలు, చెమ్ముమియాపేట, మరియాపురం, సెయింట్‌ జోసెఫ్‌ బాయ్స్‌ స్కూలు, పాతకడప ఎలిమెంటరీ స్కూలు, పీపీ యూనిట్‌ మున్సిపల్‌ హైస్కూలు మెయిన్‌, అప్పాయపల్లె జడ్పీ హైస్కూలులో వ్యాక్సిన్‌ వేయనున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సునీల్‌, తహసీల్దారు శివరామిరెడ్డి, కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:04:56+05:30 IST