Advertisement

ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌కు రెండో డ్రా

Dec 3 2020 @ 04:13AM

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌) టోర్నీలో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు రెండో డ్రా ఎదురైంది. గురువారం జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా ముగిసింది. ఇరు జట్లూ హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. అయితే సెకండాఫ్‌ ప్రారంభంలోనే హైదరాబాద్‌ గోల్‌ చేసింది. 50వ నిమిషంలో అరిడనే సంతన మెరుపు గోల్‌తో హైదరాబాద్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా.. 85వ నిమిషంలో స్టీఫెన్‌ ఇజే గోల్‌తో జంషెడ్‌పూర్‌ 1-1తో స్కోరు సమం చేసింది. ఇక ఆట చివరిదాకా ఇరుజట్లూ మరో గోల్‌ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్‌ ఫలితం తేలలేదు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.