పన్ను వసూల్లో రాష్ట్రంలో రెండో స్థానం

Published: Mon, 28 Mar 2022 00:51:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పన్ను వసూల్లో రాష్ట్రంలో  రెండో స్థానం ట్రెడ్‌ లైసెన్స్‌ ఫీజును వసూలు చేస్తున్న మున్సిపల్‌ అధికారులు

- కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌

కోరుట్ల, మార్చి 27: పన్ను వసూలు చేయడంలో కోరుట్ల ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌, ఆర్‌వో సతీష్‌ కుమార్‌ తెలిపారు. మరో ఐదు రోజుల్లో వంద శాతం పన్ను వసూలు చేయడానికి ప్రత్యేక బృందాల ద్వారా అధికారులు ప్రజలు వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణ ఆస్తి పన్ను లక్ష్యం రూ. 307.55 లక్షలు ఉండగా, ఆదివారం నాటికి రూ. 289.67 లక్షలు వసూలైనట్టు ఆర్‌వో సతీష్‌ తెలిపారు. వ్యాపార సంస్థల కోసం ట్రెడ్‌లైసెన్స్‌ ఫీజు లక్ష్యం 18.50 లక్షలు ఉండగా రూ. 18.40 లక్షలు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా వంద శాతం పన్ను వసూలు చేయడానికి పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ప్రత్యేక కౌంటర్‌తో పాటు వివిధ వార్డుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌ తెలిపారు. గతంలో మున్సిపల్‌ 97 శాతం పన్ను వసూలు చేసి మొదటి వరుసలో నిలిచిందన్నారు. అదే తరహాలో ఈ సంవత్సంరం కూడా కోరుట్ల మున్సిపల్‌ను ముందువరుసలో నిలుపడానికి ప్రజలు సహకారం అందించాలని కమిషనర్‌ తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.