ఇక పంచాయతీల్లో ఆడిట్‌!

ABN , First Publish Date - 2020-10-06T09:58:01+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు వి డుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ, జమ వివరాలతో పాటు గ్రామ పంచాయతీలలో చో టుచేసుకున్న అవినీతి

ఇక పంచాయతీల్లో ఆడిట్‌!

ఇప్పటికే 120 జీపీల్లో ‘ఆన్‌లైన్‌’లో పూర్తి

జీపీల్లో ఆదాయ, వ్యయ వివరాల పరిశీలన

ప్రభుత్వ ఖజానాలో జమకాని ఆదాయం

చెల్లించని జీఎస్‌టీ బకాయిలు, సీనరేజ్‌ 

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి రెండో విడత ఆడిట్‌

నెలఖరులోగా పూర్తిచేసే అవకాశం

పంచాయతీ అధికారుల్లో గుబులు


కామారెడ్డి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు వి డుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ, జమ వివరాలతో పాటు గ్రామ పంచాయతీలలో చో టుచేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీ సేందుకు ఆడిట్‌ అధికారులు సిద్ధమవుతు న్నారు. దీంతో పంచాయతీ అధికారుల్లో భ యం మొదలవుతోంది. చిన్నా, పెద్దా పం చాయతీలనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలలో పకడ్బందీగా ఆడిట్‌ ని ర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఏ పంచాయతీ అ వినీతీ బాగోతం బయటకు వస్తుం దోనని పలువురిలో ఆసక్తి నెలకొం టోంది. కేంద్ర ప్రభుత్వం 14 వ ఆర్థిక సంఘం నిధులను ఏడా దికి రెండు సార్లు అన్ని జీపీల కు విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రా రంభం నుంచి ప్రత్యేక ఎస్‌ ఎప్‌సీ నిధులు విడుదల చేస్తోంది. జీపీలో ఈ ని ధుల వినియోగం పార దర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభు త్వం ఆడిట్‌ ని ర్వహిస్తోంది. ఇందులో భా గంగా మొద టి విడుత ఆగస్టులో నిర్వహిం చగా రెండో విడత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.


120 జీపీలలో పూర్తయిన ఆడిట్‌

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే తొలి విడత ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేపట్టారు. ఇందులో కామారెడ్డి జిల్లాలో 120 జీపీలలో విజయవంతంగా తొలి విడత ఆడిట్‌ పూర్తయింది. గ్రామపంచాయతీలకు సంబంధించి 2019-20 సంవత్సర ఆ దాయ, వ్యయాలపై ఆడిట్‌ నిర్వహించడంలో భాగంగా తొలి విడతలో 25 శాతం పంచాయతీలను ఎంపిక చేశారు. జిల్లా లో మొత్తం 526 గ్రామపంచాయతీలు ఉండగా 120 గ్రామ పంచాయతీలతో తొలి విడత ఆడిట్‌ నిర్వహించారు. ఆగస్టు 5న మొదలవగా గత నెల 25 వరకు పూర్తిచేశారు. దేశవ్యా ప్తంగా 25శాతం పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించా రు. దీంతో చాలా జీపీలలో నిర్వహించిన ఆడిట్‌లో చాలా వి షయాలు వెలుగుచూసినట్లు అధికారులు చెబుతున్నారు. కొ న్ని జీపీలు ప్రభుత్వానికి సీనరైజ్‌ చార్జీలు చెల్లించలేదని, ఐ టీ కట్టడం లేదని, జీఎస్‌టీ బకాయిలు, ప్రభుత్వ ఖజానాలో జమచేయడం లేదని ఆడిట్‌లో తేలింది. అయితే ప్రభుత్వ ఖ జానాలో నిధులు జమచేయడం లేదనే అంశాలు వెలుగు చూశాయి. ఆడిట్‌ సమయంలో రికార్డులు చూపించని జీపీ లు 40 రోజులలోగా సరైన రికార్డులతో పాటు హార్డ్‌ కాపీల ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా వి వరాలు సమర్పించకపోతే ఆడిట్‌లో తేలిన విషయాలను ప్ర భుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఆడిట్‌ అధికారులు పే ర్కొంటున్నారు. అప్పటివరకు మిగతా పంచాయతీలలో ఆడి ట్‌ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


ఆడిట్‌ ఇలా చేస్తారు

గ్రామపంచాయతీలలో నిధుల వినియోగానికి సంబంధిం చి రికార్డులను పరిశీలిస్తారు. ఏ నిధులతో ఏ పనులు చేశా రు. అందుకు సంబంధించిన ఏంబీ రికార్డులు పరిశీలిస్తారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, వాటికి సంబంధించి న ఖర్చుల రికార్డులు, మిగిలి ఉన్న నిధుల వివరాలు పరిశీలి స్తారు. ఏఏ పనులు చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి తీసుకునే అవ కాశం కూడా ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి రి కార్డులను పరిశిలించి అన్ని సమగ్రంగా చేశారా లేదా అన్నది చూసి గ్రామాల వారీగా రిపోర్టు తయారు చేస్తారు. రికార్డు లు లేని వాటికి రిమార్క్‌ రాసి ఉంచుతారు. పంచాయతీ అ ధికారులు చూసి ఆడిట్‌ అధికారులు లేవనెత్తిన అభ్యంతరా లపై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమ యం ఇస్తారు. వివరాలు ఆడిట్‌ చేసిన అధికారి నుంచి టీం లీడర్‌కు ఆ తర్వాత జిల్లా ఆడిట్‌ అధికారికి చేరుతాయి. ఆ తర్వాత డీఏవో సరైన వివరాలు లేని వాటికి సమాదానం ఇ వ్వాలని కోరుతారు. గడువులోగా హార్డ్‌ కాపీలతో పాటు వివ రాలు అందజేయాలి, లేదంటే జీపీల్లో చేసిన ఆడిట్‌ వివరాల నే కలెక్టర్‌కు, ప్రభుత్వానికి అందిస్తారు. ఆ తర్వాత డీఏవో పంపిన నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 


నేటి నుంచి రెండో విడత ఆడిట్‌ ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని 530, కామారెడ్డిలోని 526 గ్రామపంచాయతీలలో మంగళవారం నుంచి అధికారులు ఆడిట్‌ నిర్వహించనున్నా రు. మొదటి విడత ఇప్పటికే పూర్తయినందున రెండో విడత మిగతా గ్రామపంచాయతీలలో ఆడిట్‌ చేపట్టనున్నారు. నేరు గా గ్రామపంచాయతీలకు వెళ్లి ఆడిట్‌ చేస్తారు. బృందం స భ్యులంతా ఒకేదగ్గర ఆడిట్‌ చేయాల్సి వస్తే మండల పంచా యతీ అధికారులు కార్యాలయాల్లో ఆడిట్‌ చేయనున్నారు. ఇందుకు ఆయా జీపీలకు సంబంధించిన ఆదాయ, వ్యయ వి వరాల రికార్డులు పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను ఎంపీడీవో ఆఫీసులకు జీపీ అధికారులు తీసుకెళ్లాల్సి ఉంటు ంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఆడిట్‌ అధికారులు రెండు బృందాలుగా ఏర్పాటు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


నేటి నుంచి ఆడిట్‌ చేపడుతున్నాం..విజయలక్ష్మీ, జిల్లా ఆడిట్‌ అధికారి

జిల్లాలోని గ్రామ పంచాయతీలలో మంగళవారం నుంచి  ఆడిట్‌ను ప్రారంభించనున్నాం. ఇప్పటికే జిల్లాలో 120 గ్రామ పంచాయతీలలో ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేశాం. ఇప్పుడు నేరుగా పంచాయతీలకు లేదా ఎంపీవో కార్యాలయాలకు వెళ్లి ఆడిట్‌ చేయనున్నాం. ఈ నెలఖారులోగా ఆడిట్‌ను పూర్తిచేస్తాం.

Updated Date - 2020-10-06T09:58:01+05:30 IST