పంజాబ్‌ సీఎంకు రెండో పెళ్లి

Published: Thu, 07 Jul 2022 03:10:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పంజాబ్‌ సీఎంకు రెండో పెళ్లి

నేడు చండీగఢ్‌లో వివాహ వేడుక

చండీగఢ్‌, జూలై 6 : ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(48) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హరియాణాకు చెందిన డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌ను గురువారం మనువాడబోతున్నారు. మొదటి భార్య ఇంద్రపీత్‌ కౌర్‌కు 2015లో విడాకులిచ్చిన మాన్‌కు ఇది రెండో వివాహం. మాన్‌-గుర్‌ప్రీత్‌ వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో చండీగఢ్‌లో జరగనుందని ఆప్‌ పంజాబ్‌ అధికార ప్రతినిధి మల్వీందర్‌ సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. మాన్‌, ఇంద్రప్రీత్‌కు కూతురు సీరత్‌(21), కొడుకు దిల్షాన్‌(17) ఉన్నారు. అమెరికాలో ఉంటున్న ఆ ఇద్దరూ మాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.