ltrScrptTheme3

Romantic : అంచనాలు పెంచేసిన రెండో ట్రైలర్

Oct 26 2021 @ 10:06AM

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘రొమాంటిక్’. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే డైలాగ్స్ పూరీనే అందించారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా రెండో ట్రైలర్ ను వదిలారు మేకర్స్.


 

కర్లో యా మర్లో హీరో, హీరోయిన్స్ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందో తెలిసేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో ప్రతీ కేరక్టర్, డైలాగ్ పూరీ గత చిత్రాల మాదిరిగానే విజిల్స్ వేయించబోతున్నాయని చెబుతున్నారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.